Home » AP Capital Amaravati
AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని అమరావతి నిర్మాణానికి హడ్కో భారీగా రుణం మంజూరు చేసేందుకు సానుకూలంగా స్పందించింది.
AP Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు ముందుకు వెళ్తున్నాయి. దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక అమరావతి, పోలవరానికి వెళ్లివచ్చారు. అక్కడి పరిస్థితులను చూసిన ఆయన తక్షణమే అమరావతి పనులు చేపట్టాలని ఆదేశించారు.
మూడు రాజధానుల పేరుతో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడారు. గత ఐదేళ్లుగా జగన్ సర్కార్ నిర్వాకంతో ర్యాప్ట్ ఫౌండేషన్ నీటిలోనే నానుతోంది. ఇప్పుడు ర్యాప్ట్ ఫౌండేషన్ వద్ద నిండిన నీటిని తోడే పనిని అధికారులు ప్రారంభించారు.
నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి కాల పరీక్షను ఎదుర్కొని దీటుగా నిలిచింది. నవ నగరం నీట మునిగిందంటూ దుష్ప్రచారానికి దిగినవారికి గట్టిగా సమాధానమిచ్చింది. ప్రకృతి పెట్టిన కాల పరీక్షల్లో అత్యధిక మార్కులతో పాసై ప్రజా రాజధానిగా నిలిచింది.. ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక పర్యటనలో..