Home » AP Govt
వరద బాధితులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆరా తీశారు. వరద ముంపు ప్రాంతాలైన ప్రజాశక్తి నగర్ , ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని ఉచిత వైద్య శిబిరాలు, 104 సంచార వాహనాలను మంత్రి సత్యకుమార్ ఈరోజు(ఆదివారం) సందర్శించారు.
అత్యంత క్లిష్టమైన బుడమేరు బ్రీచ్‌లను పూడ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలుగు రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్‌లు కలిసి దీన్ని పూర్తి చేశారని పేర్కొన్నారు. దీనివల్ల ఇన్ ఫ్లో పూర్తిగా ఆగిందని చెప్పారు.
న్టీఆర్ జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైందని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. జిల్లాలో 21 సెంటిమీటర్ల పడాల్సి ఉండగా 34.5 సెం.మీ. వర్షం పడిందని చెప్పారు. ఏడు జిల్లాలో వర్షాలు బాగా కురిశాయని అన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandra Sekhar) ,పెమ్మసాని రవిశంకర్ వారి ఫౌండేషన్ ద్వారా రూ. కోటి విరాళం అందజేశారు. సీఎం చంద్రబాబుకు పెమ్మసాని చెక్కు ఇచ్చారు.
ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్‌కి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు(మంగళవారం) వచ్చారు. బ్యారేజ్‌లు, వరద మానిటరింగ్, వాతావరణ హెచ్చరికలను పవన్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత వివరించారు.
నాలుగున్నర గంటల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు. వాహనాలు వెళ్లలేని ప్రాంతాలకు జేసీబీల ద్వారా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి కష్టాలను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. భవానీపురం నుంచి సితార సెంటర్, కబేళా సెంటర్, జక్కంపూడి, వాంబే కాలనీ, అంబాపురం, కండ్రిక, నున్నా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు కుండపోతగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు.
ఏపీ సరిహద్దులో గాలి జనార్ధనరెడ్డి కంపెనీకి మైనింగ్ అనుమతి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదంటూ జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించాలనుకుంటున్నామని నేడు (మంగళవారం) సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు ఏకధాటిగా కురుస్తుండటంతో విజయవాడలోని బుడమేరు పొంగి ప్రహహిస్తోంది. దీంతో పలు కాలనీలు జలమయం అవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ప్రజలను రక్షించడానికి ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
విజయవాడలో వరదలతో నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వ ఆదేశాలలో మదనపల్లె కెమిస్ట్, డ్రగ్గిస్ట్‌ల ఆధ్వర్యంలో అత్యవసర మందుల కిట్లను సరఫరా చేశారు.