Home » AP Govt
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అనేకచోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారీ వర్షాలు, వరదలపై అధికారులతో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు(శనివారం) ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను అప్రమత్తంగా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో నలుగురు మృతి చెందారని తెలిసి విచారానికి లోనయ్యానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కొండ చరియలు విరిగిపడ్డ ఘటన దురదృష్టకరమని తెలిపారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో పెద్దఎత్తున విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. ట్రిపుల్ ఐటి డైరక్టర్ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు సభ్యులతో పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలపై ఈరోజు(శనివారం) ఉదయం నుంచి నిరంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాతావరణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.
కలుషిత ఆహారం తిని, పిల్లలు, అస్వస్థతకు గురవుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. రెండు నెలల్లో పది ఘటనలు జరిగాయని గుర్తుచేశారు.ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు.
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్రూమ్ల్లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశమేంటి? ఈ మొత్తం వ్యవహారం ఉన్న కోణాలేంటి..? ఇందులో సూత్రదారులు ఎవరు..? పాత్రదారులు ఎవరు..? ఇంత జరుగుతున్నా కళాశాల యాజమాన్యం ఎందుకు మిన్నకుండిపోయింది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఐదేళ్ల వైకాపా పాలనలో చతికిలపడ్డ బిందు, తుం పర్ల సేద్యం కూటమి ప్రభుత్వం రాకతో జీవం పోసుకుంది. 90 శాతం రాయితీని ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో రైతులు బిందు, తుంపర్ల సేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు.
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 30: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని శనివారం ఉదయం 6గంటల నుంచే ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ భావన ఆదేశించారు. సెప్టెంబర్ 1వతేదీ ఆదివారం సెలవుదినం కావడంతో ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును