Home » AP High Court
విజయసాయిరెడ్డి కుమార్తె నెహారెడ్డి భీమిలి బీచ్ వద్ద సీఆర్‌జడ్ ప్రాంతంలో సముద్రానికి అతి సమీపంలో శాశ్వత కాంక్రిట్ నిర్మాణం చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలని జీవీఎంసీకి ఆదేశం..
ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉంది. అందులో పలు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ క్రమంలో 2024, మే 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. హైకోర్టులోని ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులను సంప్రదించారు. దాంతో ఈ ముగ్గురు సీనియర్ న్యాయవాదుల పేర్లు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు.
Andhrapradesh: అమ్మఒడి ఇస్తుండటంతో ఒకటో తరగతిలో 25 శాతం వరకు పిల్లలను చేర్చుకోవాలని 2023-34 సంవత్సరంలో జీవో నెంబర్ 24ను గత ప్రభుత్వం జారీ చేసింది. 2022-23 సంవత్సరంలో ఈ ఆదేశాలపై జారీ చేసిన మెమోను కోర్టులో విద్యా సంస్థలు సవాల్ చేశాయి.
Andhrapradesh: ముంబై నటి జెత్వానీ కేసులో పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా వేసింది. ఈనెల 23కు తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
తిరుపతి అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ(తుడా)కి చెందిన ముగ్గురు ఉద్యోగులను 62 ఏళ్లు నిండేవరకు సర్వీసులో కొనసాగించాలని తుడా అధికారులను హైకోర్టు ఆదేశించింది.
శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను శనివారం హైకోర్టు జడ్జి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప దర్శించుకున్నారు.
Andhrapradesh: ఈ నెల 25వ తేదీ వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన రోజున సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారని.. ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లో ఉందని పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.
Andhrapradesh: టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీకి హైకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. సురేష్‌కు షరతులతో కూడా బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే మాజీ ఎంపీ సురేష్ పై ఉన్న హత్య కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి తమ ఆయుధాలను పోలీసులు తీసుకున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. వాటిని తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.
ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారం ఏపీ హై కోర్టుకు చేరింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నీలపై సస్పెన్షన్ వేటు వేసింది.