Home » AP High Court
సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ, పోలీసు అధికారులు హనుమంతరావు, సత్యనారాయణ, న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేయాలని హైకోర్టును సీఐడీ కోరింది.
వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని నటి జత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషచం తెలిసిందే. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తున్నవారిపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ శ్రేణులతో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తప్పుడు పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకోకుండా తాము ఆదేశించలేమని హైకోర్టు పలువురు పిటిషనర్లకు సూచించింది.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఇకపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
డబ్బులు తీసుకుని అవతలివారిపైసోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే కిరాయి మూకలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవలసిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. చట్టరీత్యా నేరమైన అంశాలను సోషల్ మీడియాలో ప్రచురించిన వ్యక్తులు.. చర్యల నుంచి ఎలాంటి మినహాయింపూ కోరలేరని స్పష్టం చేసింది.
దేశ పౌరుల ప్రాథమిక హక్కులను రాజ్యాంగం పరిరక్షిస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ అన్నారు.
అమలాపురంలోని కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ ఫౌండేషన్, కర్నూలులోని విశ్వభారతి మెడికల్ కాలేజీలలో పెరిగిన 75 సీట్లను నీట్ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని హైకోర్టు పేర్కొంది.
ప్రాథమిక రాతపరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించని హోంగార్డు అభ్యర్థులకు నోటిఫికేషన్ను ప్రశ్నించే హక్కు ఉండదని, వారి విషయంలో ఇచ్చిన...
కూటమి నేతలపై గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్య పదజాలంతో కుటుంబ సభ్యులు, తల్లులపై దాడి చేస్తారా అంటూ ప్రశ్నించింది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయన కుటుంబ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలతో తిరుపతి తూర్పు ఠాణా పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ విశాఖపట్నానికి చెందిన గోర్లి సత్య నీరజ్ కుమార్ నాయుడు అనే వ్యక్తి ఏపీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.