Home » AP High Court
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న పిన్నెల్లికి ఆగస్టు-23న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది...
రాష్ట్ర హైకోర్టులో డిప్యూటీ సొలిసిటర్ జనరల్(డీఎ్‌సజీ)గా న్యాయవాది పసల పొన్నారావు నియమితులయ్యారు. డీఎ్‌సజీ హోదాలో ఆయన కేంద్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. తాము కోరినట్లుగా ఈవీఎం, వీవీప్యాట్ల తనిఖీ, పరిశీలనకు బదులుగా మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ...
సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి, వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.
రాష్ట్ర హైకోర్టులో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు.
సకాలంలో కౌంటర్లు వేయకుండా జాప్యం చేస్తే ఇకపై ఖర్చులు విధిస్తామని అధికారులను హైకోర్టు హెచ్చరించింది. వివిధ వ్యాజ్యాలలో కౌంటర్ దాఖలు చేసేందుకు తగిన సమయం ఇస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కళాశాలల్లో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS) కోటా కింద సీట్ల కేటాయింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Andhrapradesh: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. సోమవారం పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. గతంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి వద్దకే ఈ పిటిషన్ వెళ్లాలని హైకోర్టుకు పోలీసుల తరపు న్యాయవాది అశ్వనీకుమార్ సూచించారు.
Andhrapradesh: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై దాడి కేసులో పరారీలో ఉన్న సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం విజయపాల్ కోర్టులో పిటిషన్ వేయగా.. ఈరోజు విచారణకు వచ్చింది. అయితే విజయపాల్‌కు ముందుస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టుకు నిరాకరించింది.
Andhrapradesh: ముఖ్యమంత్రి హోదాలో తనకు కల్పించిన సెక్యూరిటీని పునరుద్ధరించాలంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోర్టును కోరారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్రయాణించడానికి అనుకూలంగా లేదని కోర్టుకు జగన్ తరపు సీనియర్ న్యాయవాది శ్రీరామ్ తెలిపారు.