Home » AP News
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగంలో రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్గా నిలబెట్టే లక్ష్యంతో ఐటీ పాలసీ 2024-29ను ప్రభుత్వం రూపొందించింది.
అరాచకమే హద్దుగా చెలరేగిపోయిన వైసీపీ తన ఐదేళ్ల పాలనలో చేయని దౌర్జన్యాలు లేవు. దేనిపైనైనా అప్పటి సీఎం జగన్ కన్ను పడితే చాలు.. బెదిరించడం.. అడిగింది ఇవ్వనంటే కేసుల బూచితో దారికి తెచ్చుకోవడం.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో చేపడుతున్న విదేశీ ఉపగ్రహం ప్రోబా-3 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది.
అరబిందో సంస్థ 108 అంబులెన్సులు, 104 వాహనాల నిర్వహణ నుంచి తప్పుకొనేందు కు సిద్ధమైంది. కూటమి అధికారంలోకి వచ్చి న తర్వాత అరబిందో సంస్థ పెద్ద తలనొప్పి గా మారింది. 108, 104 సేవలను సక్రమం గా అందించకపోవడంతోపాటు ఉద్యోగులకు సక్రమంగా జీతాలు కూడా చెల్లించడం లేదు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీ హద్దులు మీరింది. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా నిబంధనలు అతిక్రమించి హెచ్ఐవీ, హెపటైటి్స-బి మందులు తయారుచేస్తోంది.
కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ సెజ్ల్లో జగన్ టీమ్ బలవంతపు కబ్జాలపై సీఐడీ విచారణ జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించినట్లు సమాచారం. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో తన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
బెదిరించడం, భయపెట్టడం, వేధించడం... గత్యంతరంలేని పరిస్థితుల్లోకి నెట్టి భారీ ప్రాజెక్టులను కారుచౌకగా దక్కించుకోవడం! వైసీపీ జమానాలో జరిగిన తంతు ఇది! కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్ కూడా ఇలాగే చేతులు మారినట్లు ఇప్పటికే బలమైన అనుమానాలున్నాయి.
ఇళ్ల స్థలాల పేరుతో జగన్ జమానాలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు! అక్కరకు రాని భూములను అడ్డగోలు ధరలకు కొనుగోలు చేసి... పార్టీ నేతలకు కోట్లు దోచి పెట్టారు. ఎకరం పది లక్షలు కూడా పలకని భూములను ఐదారు కోట్లకు కొన్నారు. ఇదో భారీ కుంభకోణం!
ఆయన వైసీపీకి మండల కన్వీనరు. పైగా ఎంపీపీ భర్త. అధికారం ఉండటంలో అప్పట్లో చక్రం తిప్పాడు. కానీ చిత్రంగా.. ప్రభుత్వం మారినా ఆయన హవా కొనసాగుతోంది. పోలీసులు, మండల పరిషత అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ ఉద్యోగుల బదిలీలు, డెప్యుటేషనలు, ఉన్నచోటే కొనసాగడం.. ఇలా.. ఏదైనా సరే.. ఆయన ప్రమేయం తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. పంచాయతీ బిల్లులు పెట్టాలంటే ...
చేతికొచ్చిన వరి పంట తుఫాన దెబ్బకు నేలకొరిగింది. మండలంలోని ఉద్దేహాళ్, ఉంతకల్లు క్రాస్, దేవగిరిక్రాస్, రంగాపురం క్యాంప్, లింగదహాళ్, శ్రీధరఘట్ట తదితర గ్రామాలలో తుఫాన వర్షానికి వరిపంట నేలకొరిగింది. మండలంలోని పలు గ్రామాలలో ఈదురుగాలులతో సోమవారం రాత్రి వర్షం కురిసింది. దీంతో దాదాపు 150 ఎకరాలకు పైగా వరిపంటకు నష్టం వాటిల్లింది. అధిక ధర చెల్లించి, విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేసిన పంటను తుఫాన దెబ్బతీసిందని రైతులు ఆవేదన వ్యక్తం ...