Home » AP News
నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామివారి స్పర్శదర్శనం, ఆర్జిత గర్భాలయ, సామూహిక అభిషేకాలను రద్దీ రోజులు శని, ఆది, సోమ, ప్రభుత్వ సెలవు రోజులు, ప్రత్యేక రోజుల్లో పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీశైలం దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారిగా డిప్యూటీ కలెక్టర్ ఎం.శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్య కార్యరదర్శి ఎస్.సత్యనారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖలో కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావును డిప్యుటేషన్‌పై ఏడాది పాటు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదని కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. మంగళవారం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారి జెండా ఊపి ప్రారంభించారు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని అఖిల భారత యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లక్కరాజు రామారావు అన్నారు.
ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారు దాదాపుగా అందరూ పేద విద్యార్థులే. వారి కుటంబాల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వీరికోసం మధ్యాహ్న భోజనాన్ని అందించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడం అంత సులువు కాదు. వ్యాపారి ఎవరైనా, ఏ రాష్ట్రం వారైనా ఇక్కడున్నా డీ గ్యాంగ్‌కు అడిగినంత ఇచ్చుకోవాలి. లేదంటే బయట వ్యాపారుల నిలువలేని పోర్టు గేట్లు కూడా తాకలేవు.
కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణ అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఈనెల ఆరో తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చని అన్నారు.
చినుకులు పడితే చాటు మట్టి రోడ్లు బురదమయం, జోరుగా వాన పడితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితులు నేటికీ గిరిజన గ్రామాల్లో కనిపిస్తున్నాయి. తాజాగా గిరిజన ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం ఆదివాసీ తండాలు ఎలా ఉన్నాయనేదానికి నిదర్శనంగా నిలుస్తోంది. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి ..
ఏపీ టెక్స్టైల్ అపరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29కి క్యాబినెట్లో ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. ఏపీ మారిటైమ్ పాలసీకి క్యాబినెట్లో ఆమోదించినట్లు చెప్పారు. మూడు తాగునీటి ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడం వల్ల జీవో 62 ద్వారా ప్రైజ్ ఎడ్జెస్ట్ మెంట్ చేయబోతున్నామన్నారు. ఉద్దానం తాగునీటి వసతి, వైసీపీలో పులివెందుల, కర్నూలులో డోన్ నియోజకవర్గాలకు పదిన్నర లక్షల మందికి తాగునీటి సమస్య తీర్చడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు.
జలజీవన్ మిషన్ సక్రమ వినియోగంలో జాప్యంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జల్ జీవన్ మిషన్ డీపీఆర్‌ల స్థాయి దాటి ఎందుకు ముందుకెళ్లట్లేదని అధికారులను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.