Home » AP Police
Andhrapradesh: బాధితుల గొంతు వినిపించిన మీడియా స్వేచ్ఛపై కంచర్లపాలెం పోలీసులు దాడి చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వామి భక్తి కోసం అక్రమ కేసులు పెడుతున్న కంచర్లపాలెం పోలీసుల తీరును దేశం మొత్తం చూస్తోందన్నారు. తప్పుడు కేసులు పెట్టిన కంచర్లపాలెం పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
Andhrapradesh: ఏపీ ఎన్నికల్లో పోలీసుల తీరు ఏవిధంగా ఉందో అందరికీ తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఇప్పటికీ డీజీపీ స్థాయి నుంచి ఎస్ఐ వరకు ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈసీ చర్యలతో పోలీసుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో పోలీసు అధికారుల వరుస బదిలీలు, సస్పెన్షన్లు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి.
రాష్ట్రంలో పోలింగ్ రోజు(ఈ నెల 13న).. (AP Elections) ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను రాష్ట్ర పోలీసు యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై (MLA Rachamallu Sivaprasad Reddy) పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు ఒన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) జరిగిన పోలింగ్ రోజు, మరుసటి రోజు నుంచి కూడా వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడుతున్నాయి. మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతోంది.
నిన్న ఎయిర్ పోర్ట్‌లో అన్యాయంగా ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్‌ను అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni UMA) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై లోకేష్ అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిపై లోకేష్ తన అభిప్రాయాలు చెప్పారని అన్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. దీంతో ఎన్నికల కమిషన్ (Election Commission) వెంటనే చర్యలు చేపట్టి మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలను బదిలీ చేసింది.
న్నికల నిబంధనలను సీఎం (అపద్ధర్మ) జగన్ రెడ్డి సెక్యూరిటీ తుంగలో తొక్కారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు.
Andhrapradesh: టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై దాడి చేసిన ఘటనలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపైనా కేసు నమోదు అయ్యింది. మరోవైపు దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. భూమా అఖిల ప్రియా, ఏవీ సుబ్బారెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అఖిల ప్రియ బాడీగార్డ్‌పై దాడి నేపథ్యంలో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
ఏపీ ఏసీబీ కోర్టులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) రెడ్ బుక్ కేసుపై బుధవారం విచారణ జరిగింది. నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది.