Home » AP Police
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసినా తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు(మే13) నుంచి భారీగా అల్లర్లు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పెద్దఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.
Andhrapradesh: పోలింగ్ సమయంలో మాచర్లలో ఎలాంటి ఘటనలకు చోటు చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ఏజెంట్లను పోలింగ్ బూత్‌ల వద్దకు రానీయకుండా వైసీపీ నేతలు అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయితే మాచర్ల అల్లర్ల విషయంలో షాకింగ్ విషయం బయటపడింది. మాచర్ల అల్లర్లకు పలువురు పోలీసులే సహకరిస్తున్నట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులు... మాచర్ల అల్లర్లకు సహకరిస్తున్న పలువురు పోలీసు సిబ్బందిని గుర్తించారు.
Andhrapradesh: నంద్యాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇందులో భాగంగానే డోన్‌లో పాత కేసులతో టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ప్యాపిలి సింగిల్ విండో డైరెక్టర్ సీమ సుధాకర్ రెడ్డి, వీఆర్వో మల్లారెడ్డి, సుబ్బారెడ్డిలను ఎస్సీ, ఎస్టీ కేసులో ఖాకీలు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ముగిశాక కూడా వైఎస్సార్సీపీ (YSRCP) దాడులకు అంతులేకుండా పోతోంది. ఎన్నికల కమిషన్ (Election Commission) ఎన్నిచర్యలు తీసుకుంటున్నా వైసీపీ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఏపీ వ్యాప్తంగా నిన్న (సోమవారం) జరిగిన పోలింగ్‌లో వైసీపీ పలు కుట్రలు పన్నింది. పలు జిల్లాల్లో అరాచకాలు, అల్లర్లకు పెద్ద ఎత్తున పాల్పడింది.
నగరంలోని పోరంకిలో ఈరోజు పోలింగ్‌లో జరిగిన ఘర్షణలపై విచారణ చేస్తున్నామని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా ఎస్పీ నయీం అస్మి (SP Naeem Asmi) హెచ్చరించారు. సోమవారం మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ఆరు గంటల్లోపు బూత్ లోపలికి వచ్చిన వారికి ఓటు వేసే సౌకర్యం ఉంటుందని ఎస్పీ తెలిపారు.
పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోంది. సమస్యాత్మాక నియోజకవర్గాలో ఈసీ ఏర్పాటు చేసిన వెబ్ క్యాస్టింగ్ లేకుండా చేసేందుకు ఎత్తుగడ వేస్తోంది. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అల్లర్లు జరుగుతాయని భావించి ముందుగానే ఎలక్షన్ కమిషన్ (Election Commission) వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేసింది. వెబ్ క్యాస్టింగ్‌ను ట్రైల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ కుయుక్తులు బయట పడ్డాయి.
రాయలసీమలోని సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల్లో బలగాలని పెంచాలని ఎన్నికల సంఘాన్ని (Election Commission) బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని (Sadineni Yamini) కోరారు. ఆదివారం కూటమి పక్షం బీజేపీ నేతలు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను యామిని, కూటమి పక్షం బీజేపీ నేతలు కలిశారు.
ఏపీలో పోలీసులు ఇంకా వైసీపీ (YSRCP) కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఎన్నికల సంఘం ఎన్ని చీవాట్లు పెట్టినా వారు తీరు మాత్రం మారడం లేదు. పోలింగ్ కు ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. అయినా కూడా వైసీపీకి వత్తాసు పలకడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఆరోపణలు వస్తున్న పోలీసు అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇచ్చి కూటమి అభ్యర్థులకు మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
Andhrapradesh: సమాజంలో అందరూ రూల్ ఆఫ్ లా పాటించాలని సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీ మార్చిందని... మద్యం డిస్టలరీస్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. దీంతో పిచ్చి పిచ్చి బ్రాండ్లు తయారు చేస్తున్నారని..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu)ని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసింది. చంద్రబాబును రాజమండ్రి జైలులో కొన్ని రోజుల పాటు ఉంచి పలు ఇబ్బందులకు గురి చేసింది.