Home » AP Police
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇక.. ఎటు చూసినా పోలీసుల తనిఖీల్లో కోట్లల్లోనే నగదు పట్టుబడుతోంది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. ఇక నోట్ల తరలించే విధానం చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా.. అనంతపురం జిల్లాలో 2 వేల కోట్ల నగదు పట్టుబడింది...
Andhrapradesh: టీడీపీ నేత జయరాం నాయుడు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. గత అర్ధారాత్రి టీడీపీ నేత జయరాం నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు...
అనంతలో పోలీస్ మార్క్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలను పోలీసులు టార్గెట్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడు ను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచి ధర్మవరం, ఇతర పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆయనను పోలీసులు తిప్పుతున్నారు. జయరాం నాయుడు ఆచూకీ తెలపాలంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణులు.. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Andhrapradesh: బెజవాడలో డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. శ్రీనివాస్ సహా ఐదుగురు కుటుంబసభ్యులు సూసైడ్ చేసుకున్నారు. విజయవాడలోని గురునానక్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్యపై డీసీపీ ఆదిరాజ్ రాణా స్పందించారు.
Andhrapradesh: బెజవాడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. విజయవాడ గురునానక్ నగర్లో ఓ కుటుంబలోని ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయిన వారు ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు. భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నట్లు గుర్తించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు అక్రమాలకు పాల్పడుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు (Chittoor) జిల్లాలో మరోసారి అరాచకాలు, అలజడులు సృష్టించడానికి వైసీపీ ప్లాన్ చేసింది. జిల్లాలో మరోసారి వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. అధికార పార్టీకి బలంగా ఉన్న ప్రత్యర్థులపై దాడులకు తెగబడ్డారు.
తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల (Aranii Srenevasulu)పై వైసీపీ (YSRCP) నేతలు దాడికి పాల్పడ్డారు. శనివారం నాడు గిరిపురంలో శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir)ను తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి నేతలు శనివారం కలిశారు. వచ్చే మే నెల పింఛన్ల (pensions) పంపిణీ ఇంటి వద్దే 1,2 వ తేదీల్లో ఇచ్చేలా చూడాలని గవర్నర్ను ఎన్డీఏ నేతలు కోరారు. గవర్నర్ను కలిసిన అనంతరం కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.
ఏపీ ఎన్నికల (AP Election 2024) ముందు ఏపీ పోలీసుల (AP Police) కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్ననే అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే విషయంపై ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం తెలిసిందే.
Andhrapradesh: రాష్ట్రంలో ఐదేళ్లు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు.