Home » AP Police
ఆమె వయసు 30.. చోరీ కేసులు 34.. ఇప్పటికే 10 సార్లు జైలుకెళ్లి వచ్చింది.. అయినా మార్పు రాలేదు.. చోరీలు కొనసాగిస్తోంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధులే టార్గెట్...! వారిని మచ్చిక చేసుకుని దగ్గరవుతుంది.
Andhrapradesh: విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్లాన్‌ను మంగళగిరి పోలీసులు పటాపంచలు చేశారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని యత్నించారు. ఈ క్రమంలో మంగళగిరి పోలీసులకు శంషాబాద్వి మానాశ్రయం అధికారులు సమాచారమిచ్చారు.
Andhrapradesh: వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో జారీ వెనుక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఏఎస్‌లు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ ముందుకు ఆగకుండా వారు అడ్డుపడుతుండడంతో చర్యలు చేపట్టారు.
డ్రగ్ ఫెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్‌తో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. సోమవారం నాడు మస్తాన్‌ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు.. హైదరాబాద్‌లో డ్రగ్ సప్లై, కస్టమర్లు వ్యవహారంపై ఆరా తీశారు. ఈ టైమ్‌లోనే మస్తాన్ ఫ్రెండ్ ప్రీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు అమ్మాయిలతో అసభ్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలు వెలుగుచూశాయి...
ఏసీబీ దాడులతో మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమాల పుట్ట బద్ధలవుతోంది. ఆయన దోపిడీ యవ్వారం అంతా బట్టబయలవుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జోగి రమేష్, ఆయన కుటుంబ సభ్యులు భారీ అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. త్వరలోనే పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన అనిత..
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తరిగింది. రోజుకో కొత్త విషయం.. పూటకో ట్విస్ట్‌గా సాగుతున్న ఈ ఎపిసోడ్లో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు మస్తాన్ సాయి. ఇతను డ్రగ్ పెడ్లర్‌గా వ్యవహరిస్తూ.. పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఓవైపు లావణ్య కేసులో.. మరోవైపు వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో మస్తాన్ పేరు మార్మోగింది. ఈ క్రమంలోనే నిందితుడిని గాలించిన ఏపీ పోలీసులు సోమవారం నాడు గుంటూరు జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు..
వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు..! ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరించారు..! టీడీపీ (Telugu Desam) కార్యకర్తలు మొదలుకుని నేతలు.. ఆఖరికి పార్టీ ఆఫీసులను కూడా ధ్వంసం చేసిన సందర్భాలు..
జిల్లాలో 16 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వ్యులు జారీ చేశారు. రెండు రోజుల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.
విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు చేపట్టిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్ థాన్‌కు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మారథాన్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.