Home » AP Politics
వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌కు సొంత నియోజకవర్గ ప్రజలు మరో షాకిచ్చారు. తాజాగా ఇవాళ రెండు వందల మైనారిటీ కుటుంబాలు వైసీపీకి తిలోదకాలిచ్చి టీడీపీ కండువా కప్పుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తెలుగుదేశం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
గత ఐదేళ్లలో దేశంలో ఒక్క డీఎస్సీని నిర్వహించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు.
రైతుల మీద మొసలికన్నీరు కారుస్తున్న సజ్జల గత ఐదేళ్లల్లో ఏం చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ప్రశ్నల వర్షం కురిపించారు. గంజాయిని సాగు చేయించి కోట్లు దండుకున్నారని ఆరోపించారు. జగన్ అండ్ కో పాల్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
సీఎం చంద్రబాబు తన విజనరీతో అన్నతాతలకు పంచ సూత్రాలను అందిస్తున్నారని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. పంచ సూత్రాల ద్వారా రైతులు తమ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడతారని పేర్కొన్నారు.
గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మత్స్యకారులకు వలలు, బోట్లకి సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి చేస్తోందని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో స్వర్ణాంధ్రప్రదేశ్‌ని వికసిత్ భారత్‌గా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రజలు కూటమి ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని వివరించారు. ఈ సదస్సును సోషల్ మీడియాలో యువత కూడా స్వాగతిస్తూ భారీస్థాయిలో పోస్టులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు.
ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఒక్కరోజే రాష్ట్రంలో మూడులక్షల ఇళ్లకు గృహా ప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు.