Home » APPSC
రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. కీలకమైన 150 గ్రూప్-1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో 866 ఖాళీలను ఈ ఏడాదిలో భర్తీ చేయనుంది.
ఏపీపీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను చంద్రబాబు ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్నారు. అసలు అయితే ఈ పరీక్ష జనవరి 5వ తేదీన జరగాల్సి ఉంది. అయతే ఈ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలంటూ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్.. సీఎం చంద్రబాబను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమితులైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి ఏఆర్ అనురాధ గురువారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను బుధవారం నియమించింది. దీనికి ఛైర్మన్‌గా మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
డీజీపీగా రాష్ట్ర పోలీసు వ్యవస్థను వైఎస్సార్సీపీకి దాసోహం చేసి.. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్‌గా విమర్శలకు గురైన గౌతమ్ సవాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.