Home » Army
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరుగురిని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరిలో ఐదుగురు పోలీసులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు.
అకస్మాత్తుగా ఓ బుల్లెట్ దూసుకొచ్చి.. ఇంట్లో దుస్తులు ఆరేస్తున్న మహిళ కాలిలోకి దిగింది. ఆ మహిళ హడలిపోయి కిందపడింది. నార్సింగ్ పోలీసుల కథనం ప్రకారం.. గోల్కొండ తారామతి మిలటరీ ఏరియా(Golconda Taramati Military Area)లో ఫైరింగ్ సెంటర్ ఉంది. ఆ పక్కన గంధంగూడ గ్రామం ఉంది.
హిజ్బుల్లా మిలిటరీ కమాండర్ ఫద్ షుక్రూను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. బీరట్‌లో ఉన్న ఫద్ షుక్రూను తమ వైమానిక దళ ఫైటర్ జెట్లు దాడులు చేశాయని వివరించాయి. హిజ్బుల్లాకు ఫద్ షుక్రూ సీనియర్ కమాండర్, వ్యూహాత్మక విభాగం అధిపతిగా వ్యవహరించారు. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతం గోలన్ హైట్స్ వద్ద ఇటీవల రాకెట్ దాడి జరిగింది. ఆ దాడిలో 12 మంది చిన్నారులు చనిపోయారు.
పాకిస్థాన్ ప్రత్యేక సైన్యంతోపాటు ఉగ్రవాదులతో కూడిన ‘బోర్డర్ యాక్షన్ టీమ్’ (బ్యాట్ దళం) భారత ఆర్మీ పోస్టుపై చేసిన అకస్మాత్తు దాడిలో ఓ జవాను మృతి చెందగా, కెప్టెన్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
దాయాది పాకిస్థాన్ ఉగ్ర కుట్రలను సైన్యం తిప్పికొడుతుందని ప్రదానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాద ఘాతుకాలు, దొంగ యుద్ధాలతో కవ్వింపు చర్యలకు పాకిస్థాన్ పాల్పడుతూనే ఉంది.
కార్గిల్ యుద్ధాన్ని భారత్ గెలిచి పాతికేళ్లు అవుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. యుద్ధంలో మన సైనికులు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఆయన ఒక ప్రకటనలో కొనియాడారు.
కార్గిల్ 25వ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా కార్గిల్‌లోని ద్రాస్‌లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ శుక్రవారం సందర్శించారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన సైనికులకు నివాళి అర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అమర జవాన్ల కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ఒక్క నెలలోనే ఆరు ఉగ్ర దాడులు జమ్మును కుదిపేశాయి. 20 మందికిపైగా ఆర్మీ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ దాడులను రక్షణ శాఖ సవాల్‌గా తీసుకుంది. జమ్ము పరిధిలోని దట్టమైన అడవుల్లో దాగి, ఆర్మీపై దొంగ దాడులు చేస్తున్న ముష్కరుల పని పట్టేందుకు 500 మందితో కూడిన పారా కమాండో దళాన్ని రంగంలోకి దించింది.
భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు కాల్చి చంపాయి. ఆదివారం సైనిక దళాలు ....
మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్ఫ(సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్) జవాన్ మృతి చెందారు.