Home » Army
దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రిని ఓసారి వచ్చిపో అంటూ కుమారుడు పిలవడం మానవ హృదయాలను కంటతడిపెట్టిస్తోంది. తన తండ్రి ఈలోకంలో లేరనే విషయాన్ని ఆ పసి హృదయం జీర్ణించుకోలేకపోతుంది. ఎప్పుడూ తన కోసం వచ్చే తండ్రి కొద్దిరోజులుగా ఎందుకు రావడంలేదని ఆ చిన్నారి తల్లిని ప్రశ్నిస్తోంది.
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా కీలక ముందడుగు పడింది. తొలిసారి స్వదేశీయంగా రూపొందించిన ఆత్మాహుతి డ్రోన్ నాగాస్త్ర-1 భారత ఆర్మీ అమ్ములపొదిలో చేరింది. నాగ్‌పూర్‌లోని సోలార్ ఇండస్ట్రీ్‌సకు చెందిన ఎకనామిక్స్ ఎక్స్‌ప్లోజివ్ లిమిటెడ్ (ఈఈఎల్) ఈ యూఏవీ (మానవ రహిత విమానం) డ్రోన్లను తయారు చేసింది.
భారత ఆర్మీకి కొత్త చీఫ్ రానున్నారు. ప్రస్తుత సైన్యాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఈ నెల 30న రిటైర్ కానున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో తదుపరి చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిని
మన సైన్యాన్ని విపక్ష ‘ఇండీ’ కూటమి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.
భారత్(india), చైనా(china) సైనికుల మధ్య క్రీడ ఏదైనా తగ్గపోరు పోటీ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్(tug of war)లో చైనా సైనికులను భారత ఆర్మీ సైనికులు చిత్తు చిత్తుగా ఓడించారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే పదవీ కాలాన్ని జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ ఆదివారం నిర్ణయం తీసుకుంది. మనోజ్ పాండే పదవీ కాలం మే 31తో ముగియనుంది.
న్యూఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పదవీకాలాన్ని (Tenure) నెలరోజుల పాటు కేంద్రం పొడిగించింది. ఆయన పదవీకాలం పొడిగింపును కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆదివారంనాడు ఆమోదం తెలిపింది.
భారత రక్షణ రంగంలో కీలక ముందడుగు పడింది. మెషిన్‌గన్‌తో శత్రువులపై విరుచుకుపడే అత్యాధునిక హెక్సాకాప్టర్ డ్రోన్‌ను భారత సైన్యం పరిచయం చేసింది. ‘మేకిన్ ఇండియా’లో భాగంగా ఇక్రాన్ ఏరోస్పేస్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ దీన్ని రూపొందించింది. ఇదొక మానవ రహిత ఏరియల్ వాహనం (యూఏవీ).
జాతుల మధ్య అల్లర్లతో ఇటీవల కాలంలో అట్టుడికిన మణిపూర్ లో మరో ఆర్మీ అధికారి కిడ్నాప్ అయ్యారు. ఇంటి నుంచి అగంతకులు ఆయనను అహపరించుకుని వెళ్లారు . గత మేలో మణిపూర్‌లో హింసాకాండ చెలరేగినప్పటి నుంచి చోటుచేసుకున్న నాలుగో కిడ్నాప్ ఇది.
భారత రక్షణశాఖ సామర్థ్యాలను మరింత పెంపొందించేందుకు గాను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.84,560 కోట్ల మూలధన సేకరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.