Home » Arrest
బీఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అరెస్టు ఘటన గురువారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల తీరు హైడ్రామాను తలపించగా, బీఆర్ఎస్(BRS) శ్రేణులు ఆందోళనలకు దిగాయి. చింతకాని మండలంలోని పొద్దుటూరుతో పాటు మధిర, వైరాల్లో పోలీసుల చర్య కలకలం రేపింది. కారులో మఫ్టీలో వచ్చిన నలుగురు ఎస్ఐలు, ఒక సీఐ... అయ్యప్ప మాలలో ఉన్న పుల్లయ్యను బలవంతంగా తీసుకెళ్తుండగా, ఆయన భార్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్న పేరు మోసిన ఇద్దరు రౌడీషీటర్ల ఆటకట్టించారు సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Southzone Task Force Police) బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లిలో వాలంటీర్‌గా పనిచేసే జనుపల్లి దుర్గా ప్రసాద్ అనే యువకుడు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా గుర్తించిన పోలీసులు వైసీపీ నేత, మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యకలాపాలను నిర్వహించిన సికింద్రాబాద్ మెట్రో పొలిస్ హోటల్ యజమాని రషీద్, మేనేజర్ రహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బిగ్‌బాస్ కంటెస్టెంట్, రేడియో జాకీ(ఆర్జే) శేఖర్ బాషాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు శేఖర్ బాషాను విచారించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
మావోయిస్ట్ పార్టీ మహిళా అగ్రనేత సుజాత అలియాస్ కల్పన పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం కొత్తగూడెంలోని హాస్పిటల్‌కు రాగా పోలీసులు పట్టుకున్నట్లు తెలియవచ్చింది. కాగా మహబూబాబాద్ బస్టాండ్‌లో ఆమెను అరెస్ట్ చేసినట్లు మరో ప్రచారం జరుగుతోంది.
అత్త, కోడలిపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. హిందూపురం డీఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న మిల్లులో వాచమెనగా పనిచేస్తున్న కుటుంబంలో అత్తాకోడలిపై ఈనెల 11వ తేదీ అర్ధరాత్రి ఆరుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దుండగులను ...
ఎట్టకేలకు నేవీ రాడార్ స్టేషన్‌కు మంగళవారం పునాది రాయి పడబోతోంది. హైదరాబాద్‌కు 60 కి.మీ. దూరాన, సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో దీనికి అంకురార్పణ జరుగనుంది. మంగళవారం మధ్యాహ్నం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన చేయనున్నారు.
పవిత్రమైన వైద్య వృత్తి చేపట్టి డబ్బు కోసం అక్రమాలకు పాల్పడ్డ వైద్యురాలు కటకటాలపాలయ్యింది. దావణగెరె(Davanagere)లో నవజాతశిశువు విక్రయానికి సంబంధించిన వివాదంలో డాక్టర్ సహా 8మందిని అరెస్టు చేశారు.
చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పాత నేరస్థుడిని ఎల్బీనగర్ సీసీఎస్, రాచకొండ ఐటీ సెల్, చైతన్యపురి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.9లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నారు.