Home » Arvind Kejriwal
కేజ్రీవాల్, ఆప్ మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, మాజీ ద్వారక కౌన్సిలర్ నితిక శర్మ ఉద్దేశపూర్వకంగానే ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తూ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లు పెట్టారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్రం హోషియార్‌పూర్‌లోని "విపశ్యన'' ధాన్య కేంద్రంలో బుధవారం నుంచి పదిరోజులు పాటు పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ట్రిప్ సైతం రాజకీయ విమర్శలకు దారితీసింది.
కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత తల్లిదండ్రులను కూడా వాడుకున్నారని పర్వేష్ వర్మ ఆరోపించారు. తన తండ్రి నడవగలిగినప్పటికీ కేవలం ఓట్ల కోసం ఆయనను వీల్‌చైర్‌లో తీసుకువచ్చారని చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎంపీగా పార్లమెంటులో కాలుపెడతారంటూ వస్తున్న వార్తలపై ఆప్ క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ప్రతిపక్షాలు వ్యాపిస్తున్న రూమర్లంటూ కొట్టి పారేసింది.
పంజాబీ చిత్రాల్లోనే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ సోనియా మాన్ నటించారు. మలయాళం, హిందీ, తెలుగు, మరాఠీ భాషల్లో ఆమె నటించారు. ''హెడ్ ఎన్ సీక్'' అనే మలయాళ చిత్రంలో సినీరంగప్రవేశం చేసిన ఆమె 2014లో 'కహీ హై మేరా ప్యార్' అనే చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టారు.
బీజేపీ నేతలు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు సైతం ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తుండటంతో రామ్‌లీలా మైదాన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 5,000కు పైగా భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు.
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌పై కేంద్ర ప్రభుత్వం గురి పెట్టింది. కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీలోని 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో ఉన్న సీఎం అధికారిక నివాసాన్ని పునరుద్ధరించే పనులు చేపట్టిన విషయం తెలిసిందే.
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ది.. రాహుల్‌గాంధీని డామినేట్ చేసే పర్సనాలిటీ కానే కాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోవడమే కాదు.. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా సైతం ఓటమి పాలయ్యారు. మరి అలాంటి వేళ.. భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా హస్తం పార్టీకి ఆయన స్నేహ హస్తం అందిస్తారా? లేక కటీఫ్ చెబుతారా? అనే ఓ మీమాంస సామాన్యుడిలో కొనసాగుతోంది.