Home » Assembly elections
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఏక్నాథ్ షిండే ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు గురువారం రాత్రి దేశ రాజధాని న్యూఢిల్లీలో అమిత్ షాతో అజిత్ పవార్, ఫడ్నవీస్ సమావేశమై.. రాష్ట్రంలో అధికార పంపిణీ ఒప్పందంపై చర్చించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఈసీ తాజా ఆహ్వానం పంపింది. నేరుగా తమను కలవాలని, అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన తీర్పు ఇచ్చినా.. అధికార పగ్గాలు ఎవరు చేపట్టాలనే అంశంపై స్పష్టత మాత్రం రాలేదు. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు ప్రమోషన్ వస్తుదంటూ ఊహగానాలు ఊపందుకున్నాయి. ఇక అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. మరి షిండ్ మాత్రం డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు అయిష్టత చూపుతున్నారనే ప్రచారం సాగుతుంది.
కాగా, ఢిల్లీ 7వ అసెంబ్లీ గడువు 2025 ఫిబ్రవరితో ముగియనుంది. దీంతో ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. చివరిసారిగా 2020 అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించారు.
జార్ఖండ్ కొత్త సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారు అయింది. అంతకుముందు గవర్నర్ సంతోష్ గాంగ్వార్‌తో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ఆదివారం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఇండియా కూటమికి పట్టం కట్టారు. ఈ కూటమిలోని భాగస్వామ్య పక్షమైన జేఎంఎం అత్యధిక స్థానాలను గెలుచుకుంది. మిగిలిన మిత్రపక్షాలైన కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు సైతం పలు స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ గంగ్వార్‌తో జేఎంఎం అధినేత, సీఎం హేమంత్ సోరెన్ సమావేశం కానున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం, మంత్రి మండలి ప్రమాణ స్వీకర కార్యక్రమం సోమవారం జరిగే అవకాశముందని శిండే కేబినెట్లోని సీనియర్ మంత్రి దీపక్ ఆదివారం ముంబయిలో వెల్లడించారు.
ప్రభుత్వం ఏర్పాట్లు ప్లాన్‌పై చర్చించేందుకు అజిత్ పవార్, షిండే, దేవేంద్ర ఫడ్నవిస్‌లకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి పిలుపు వచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్‌ను దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం ఉదయం కలుసుకున్నారు.
Maharashtra Elections: మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఆ స్టేట్ పాలిటిక్స్‌లో ఊహించని ట్విస్ట్ వచ్చింది. ఏంటా ట్విస్ట్? అనేది ఇప్పుడు చూద్దాం..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు సినిమా విలన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ వ్యక్తి అనేక తెలుగు సినిమాల్లో విలన్‌గా నటించాడు. ఇన్‌స్టాలో ఏకంగా 5.6 మిలియన్ ఫాలోవర్లు కూడా ఉన్నారు. అంతేకాకుండా బిగ్ బాస్ షోలో పాల్గొని ఎంతో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. అయినా ఆ సెలబ్రిటీకి మాత్రం..