Home » Assembly elections
బీజేపీ కేవలం అధికారదాహంతో ప్రత్యర్థులను జైలులోకి నెడుతోందని, పార్టీలను చీల్చడం ఎలాగో వారికి బాగా తెలుసునని సునీత కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.
జమ్మూకశ్మీర్ ఎన్నికలు చరిత్రాత్మకమని, ఎన్నికల ప్రచారాన్ని 'వినాయకత చవితి' రోజున బీజేపీ ప్రారంభించిందని కేంద్రం హోం మంత్రి అమిత్షా అన్నారు. తొలిసారి రెండు జెండాల నీడలో కాకుండా ఒకే జెండా త్రివర్ణ పతాకం కింద ఇక్కడి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు.
కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా రూ.18,000 ఇచ్చేందుకు 'మా సమ్మాన్ యోజన' అనే పథకం తీసుకువస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఉజ్వల స్కీమ్ కింద ఏటా రెండు సిలెండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపింది. కాలేజీ విద్యార్థులకు ట్రావెల్ అలవెన్స్గా ఏటా రూ.3,000 ఇస్తామని హామీ ఇచ్చింది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయింది. న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు వారు పార్టీలో చేరనున్నారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 67 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు కీలక నేతల పేర్లను ప్రకటించింది. హరియాణా ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పేరు ఈ జాబితాలో ఉంది. ఆయన లాడ్వా నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయగా.. గురువారం బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.
ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 'మహా వికాస్ అఘాడి' మెజారిటీ సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఎన్సీపీ-ఎస్పీ సుప్రీం శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం ఎవరనేది ఆ తర్వాతే నిర్ణయిస్తామని చెప్పారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్(Vinesh Phogat) రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ వీడింది. అందరి అంచనాలకు తగినట్లే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటారని, జమ్మూ ప్రాంతంలో రెండు చోట్ల, కశ్మీర్లో ఒక చోట బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రధాని ప్రచారం సాగిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.
పీడీపీ ఒక నిర్దిష్ట ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తోందని, పీడీపీని కలుపుకోకుండా ఏ పార్టీ కూడా ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని మెహబూబు ముఫ్తీ పేర్కొన్నారు.