Home » Assembly elections
అధికార మహాయుతి కూటమి, విపక్ష మహా వికాస్ అఘాడి మధ్య పోటీ నువ్వా-నేనా అనే రితిలో ఉండనుండదనే అంచనాల మధ్య ప్రధానంగా 5 నియోజకవర్గలపైనే అందరి దృష్టి నెలకొంది. ఇక్కడ పోటీ మహా సంగ్రామాన్నే తలపించనుందని చెబుతున్న ఆ నియోజకవర్గాలపై ఓ ఫోకస్.
ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ డేను 'సెలవు దినం'గా ప్రకటించింది. కొన్ని సర్వీసులు యథాప్రకారం పనిచేయనుండగా, మరికొన్ని సేవలు మూతపడతాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇటు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొంది. దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. మహారాష్ట్రలో ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీలు గత రెండేళ్లలో అడ్డంగా చీలిపోవడం, చీలక పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా వేర్వేరు కూటమిల్లో తలపడతుండటం ఈ ఆసక్తిని పెంచుతోంది
జార్ఖాండ్‌లో ప్రధాన పోటీ అధికార జార్ఖాండ్ ముక్తి మోర్చా సారథ్యంలోని 'ఇండియా' కూటమికి, భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి మధ్య ఉంది. 'ఇండియా' కూటమిలో జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి భాగస్వామ్య పక్షాలు ఘన విజయం సాధిస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ అభ్యర్థలు గెలుపు కోసం పిఠాపురంలోని శ్రీ పాద వల్లభ స్వామి ఆలయంలో బీజేపీ, జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయని ఆయన తెలిపారు.
కాంగ్రెస్, జేఎంఎం నేతల ఇళ్లల్లో పెద్దఎత్తున నోట్లకట్టలు పట్టుబడ్డాయని, ఈ సొమ్మంతా కాంగ్రెస్‌దా, ఆర్జేడీ లేదా జేఎంఎందా అని ఆయన ప్రశ్నించారు. అందతా రాష్ట్రాభివృద్ధికి మోదీ పంపిన సొమ్మని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలన్నారు.
నవంబర్ 20న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. తన వాదనకు బలం చేకూర్చే రెండు పోస్టర్లను ఆయన ప్రదర్శించారు.
ఉత్తరప్రదేశ్‌లో అతి పెద్ద ఆసుపత్రుల్లో ఒకటి.. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో ఝాన్సీ మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీ ఆసుపత్రి. నవంబర్ 15 అంటే.. శుక్రవారం రాత్రి ఈ ఆసుపత్రిలోని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 11 మంది పసికందులు సజీవ దహనమయ్యారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. నవంబర్ 20వ తేదీన ఒకే విడతలో ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23వ తేదీన వెలువడనున్నాయి.
షెడ్యూల్ ప్రకారం నాలుగు ర్యాలీల్లో కేంద్ర మంత్రి పాల్గొనాల్సి ఉంది. కతోల్, సవ్నేర్ (నాగపూర్ జిలలా), గడ్చిరోలి, వర్దా జిల్లాల్లో అమిత్‌షా ప్రచారం సాగించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో గట్టి పట్టు సాధించే వ్యూహంతో బీజేపీ ప్రచారం సాగిస్తోంది.