Home » Bail
చిత్రదుర్గ రేణుకాస్వామి(Chitradurga Renuka Swamy) హత్యకేసులో ఏ2గా ఉన్న నటుడు దర్శన్(Actor Darshan) బెయిల్ ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సమ్మతించింది. హత్యకేసులో రిమాండు ఖైదీగా బళ్ళారి జైలులో ఉంటూ దర్శన్ వెన్నునొప్పి చికిత్స కోసం మధ్యంతర బెయిల్ పొందారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో దారుణం జరిగింది. బెయిల్‌పై బయటకు వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు బిడ్డల్ని కాల్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సెంట్రల్ ముంబైలోని గాందేవిలో గోల్డెన్ క్రౌన్ హోటల్ యజమానిగా ఉన్న జయాశెట్టి 2001 మే 4న హోటల్ ఫస్ట్ ఫ్లోర్లో హత్యకు గురయ్యారు. ఛోటారాజన్ ముఠాలోని ఇద్దరు సభ్యులు ఆయనను కాల్చిచంపారు. రాజన్ గాంగ్ సభ్యుడు హేమంత్ పూజారి డబ్బుల కోసం జయశెట్టిని బెదిరించాడని, ఆయన ఇవ్వడానికి నిరాకరించడంతో హత్య చేశారని విచారణలో తేలింది.
విచారణలో జాప్యం, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచిన కారణంగా సత్యేంద్ర జైన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. విచారణకు తెరపడేటట్టు కనిపించడం లేదని కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టులో చుక్కెదురు అయ్యింది. బెయిల్‌పై తనను విడుదల చేయాలంటూ జానీ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని, దానిపైనా విచారణ జరపాలని మంగళవారం సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు...ఈ మూడింటిని ఒకేసారి వినాలని ధర్మాసనానికి విజ్ణప్తి చేశారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ముందస్తు విడుదల కోసం పిటిషన్లలో న్యాయవాదులు తప్పుడు సమాచారం ఇస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
లిక్కర్ స్కామ్ కేసులో సుమారు అయిదున్నర నేలల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పలు షరతులతో శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తల సంబరాల మధ్య తీహార్ జైలు నుంచి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూనే తన స్పందన తెలియజేశారు.
లిక్కర్ స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు(Tihar Jail) నుంచి విడుదలయ్యారు.
ఆరు నెలల అనంతరం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఆనందం వెల్లువిరిసింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.