Home » Balashowry Vallabhaneni
మచిలీపట్నం నుంచి విశాఖపట్నం, తిరుపతికి రైళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని మచిలిపట్నం ఎంపీ బాలశౌరి (MP Balasouri) కోరారు. ఆగస్టు నుంచి రైళ్లు పునరుద్ధరించాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని కోరారు.
Andhrapradesh: తెలంగాణా, ఏపీ విభజన తర్వాత ఏపీ పునర్విభజన చట్టంలో ఒక రిఫైనరీ ఇవ్వాలని ఉందని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. ఇటీవల ఢిల్లీ వచ్చిన చంద్రబాబు.. ఈ అంశాన్ని కేంద్ర పెద్దలను కలిసి విన్నవించారని తెలిపారు.
దేశ వాణిజ్య రాజధాని ముంబైకి విజయవాడ నుంచి డైలీ ఫ్లైట్ ప్రారంభమైంది. విజయవాడ(గన్నవరం) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 7.15 గంటలకు 180 సీట్ల సామర్థ్యం కలిగిన ఎయిర్‌ఇండియా ఎయిర్‌బస్ విమానం బయలుదేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముని గిపోతున్న నావలా తయారైంది. ఎన్నికలకు ముందే రాజకీయ దిగ్గజాలు ఆపార్టీని వీడుతున్నారు. ఒకరిద్దరంటే అనుకోవచ్చు.. పదుల సంఖ్యలో ప్రముఖ నాయకులు జగన్‌కు గుడ్‌బై చెబుతున్నారు.. వేల సంఖ్యలో ద్వితీయ శ్రేణి నాయకులు వైసీపీని వదిలి వెళ్లిపోతున్నారు.
AP Elections 2024: జనసేన (Janasena) తరఫున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి (Balashowry Vallabbhaneni) బరిలో ఉంటారని అంతా భావించారు. వైసీపీ తరఫున 2019లో ఎంపీగా గెలిచిన ఈయన ఈ ఏడాది జనవరి 14న ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఫిబ్రవరి 4న జనసేనలో చేరారు. అప్పటి నుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. కానీ, నేడు, రేపు అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు...
ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి(Vallabhaneni Balasouri ) అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో బాలశౌరి పార్టీలో చేరారు.
2004లో వైఎస్ శిష్యుడిగా తాను రాజకీయాల్లోకి వచ్చానని ఎంపీ బాలశౌరి(MP Balashouri) తెలిపారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. బందర్ పోర్టు నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు.
సొంత పార్టీ వైఎస్ఆర్ సీపీపై అసంతృప్తితో ఉన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరే ముహూర్తం ఖరారయ్యింది. ఫిబ్రవరి 4వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతారు.
MP Balashowry: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSR Congress) పరిస్థితులు అల్లకల్లోల్లంగా తయారవుతున్నాయి. అసలు పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటన వస్తుందో అని సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. నియోజకవర్గాల్లో ఇంచార్జుల మార్పుతో వైసీపీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి..
YSRCP Resigns: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నియోజకవర్గాల ఇంచార్జుల మార్పులు, అభ్యర్థుల మార్పులతో సిట్టింగులు వరుస షాకులిస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌లో రాజీనామా చేయగా.. మరికొందరు రాజీనామాకు రంగం సిద్ధం చేసుకున్నారు. సంక్రాంతి తర్వాత వైసీపీకి అధికారికంగా రాజీనామా చేసేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు.