Home » Bandi Sanjay Kumar
కాంగ్రెస్ పార్టీకి సర్దార్ పటేల్ కంటే రజాకార్లపైనే ప్రేమ ఎక్కువ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దేశ విచ్ఛిన్నం కోసం ప్రయత్నించిన వారసుల పార్టీతో అంటకాగుతున్న కాంగ్రె్‌సకు పటేల్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లు వక్రభాష్యం చెబుతున్నాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
‘‘హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు?
Telangana: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీయే బెయిల్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ యే కవితకు బెయిల్ ఇప్పించేందుకు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు.
రుణమాఫీపై త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసమని.. రైతు బంధు విషయంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు రైతు బంధు రాక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘అతి త్వరలోనే కాంగ్రె్‌సలో బీఆర్ఎస్ విలీనం కానుంది. కేసీఆర్‌కు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇవ్వనుంది.
తెలంగాణలో ‘విలీనం’ పై గట్టిగానే రాజకీయాలు నడుస్తున్నాయ్..! అదిగో ఫలానా పార్టీ.. ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటే.. అబ్బే మీరు మీరే ఒకటి కాబోతున్నారని మరో జాతీయ పార్టీ అంటోంది..! ఈ విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ అన్నింటిలోనూ కామన్‌గా బీఆర్ఎస్ పార్టీ ఉంది..! బీజేపీతో బీఆర్ఎస్కు సన్నిహిత సంబంధాలున్నాయన్నది కొన్నేళ్లుగా నడుస్తున్నదే..!
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై రాహుల్ గాంధీ నోరు విప్పకపోవడానికి ఆయనకు చైనా నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని, చైనా ఆలోచనలను రాహుల్ భారత్‌లో అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్లలో నిర్మించతలపెట్టిన ఫోర్త్ సిటీ వెనుక భారీ భూకుంభకోణం దాగి ఉందని, వేలాది ఎకరాలను దిగమింగి ఆస్తులను కూడబెట్టుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్రంలోని మోదీ సర్కారును బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్నారని, కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.లక్షా తొమ్మిది వేల కోట్లు ఉన్నాయని తెలిపారు.