Home » Bandi Sanjay Kumar
తెలంగాణలో ‘విలీనం’ పై గట్టిగానే రాజకీయాలు నడుస్తున్నాయ్..! అదిగో ఫలానా పార్టీ.. ఈ పార్టీలో విలీనం కాబోతోందని ఓ జాతీయ పార్టీ అంటే.. అబ్బే మీరు మీరే ఒకటి కాబోతున్నారని మరో జాతీయ పార్టీ అంటోంది..! ఈ విషయంలో ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ అన్నింటిలోనూ కామన్‌గా బీఆర్ఎస్ పార్టీ ఉంది..! బీజేపీతో బీఆర్ఎస్కు సన్నిహిత సంబంధాలున్నాయన్నది కొన్నేళ్లుగా నడుస్తున్నదే..!
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై రాహుల్ గాంధీ నోరు విప్పకపోవడానికి ఆయనకు చైనా నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని, చైనా ఆలోచనలను రాహుల్ భారత్‌లో అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్లలో నిర్మించతలపెట్టిన ఫోర్త్ సిటీ వెనుక భారీ భూకుంభకోణం దాగి ఉందని, వేలాది ఎకరాలను దిగమింగి ఆస్తులను కూడబెట్టుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. కేంద్రంలోని మోదీ సర్కారును బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్నారని, కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.లక్షా తొమ్మిది వేల కోట్లు ఉన్నాయని తెలిపారు.
Telangana: కాళేశ్వరంకు పోయిన వాళ్ళందరూ నాస్తికులే అని.. అందుకే గుడి యొక్క సాంప్రదాయాలను పాటించలేదని బీఆర్ఎస్ నేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గర్భగుడి లోపలికి వెళ్లేముందు ఎలా ఉండాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలీదా అని ప్రశ్నించారు. గర్భగుడిలోకి వెళ్లే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లాలని గుడి వద్ద బోర్డు ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి గడిచిన పదేళ్లలో ఎంతో చేశామని, భవిష్యత్తులోనూ మరెంతో చేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు.
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు(Bandi Sanjay) తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మరోసారి సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ 70 శాతం మందికి వర్తించడం లేదని బండి సంజయ్ అన్నారని.. అది నిరూపించకపోతే తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రజల మనిషి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎ్‌సలో ఉన్న ఏకైక మంచి వ్యక్తి, వివాదరహితుడు హరీశ్‌రావు మాత్రమేనని ప్రశంసించారు.
‘ఇన్నాళ్లకు సిరిసిల్ల చేనేత కార్మికులు గుర్తుకొచ్చారా..? పదేళ్లు అధికారంలో కొనసాగిన మీరు ఎందుకు నేతన్నల సమస్యలు పరిష్కరించలేదు..? మీ హయాం నుంచి చేనేత కార్మికుల ఆకలి చావులు కొనసాగుతున్నది నిజం కాదా..?’’
ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లకు మెగా పవర్‌లూం క్లస్టర్‌ను తీసుకొచ్చేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి చేయాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.