Home » Bandi Sanjay
రేవంత్ ప్రభుత్వ అసంబద్ధమైన నిర్ణయాలు రాష్ట్ర పురోగతికి గొడ్డలి పెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిక్స్డ్ చార్జీలను రూ.10నుంచి రూ.50కు పెంచాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఇప్పటికే కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన 29 జీవోను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్-1 పరీక్షను వెంటనే రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎట్టి పరిస్థితుల్లో వాయిదా కుదరదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పాటు.. కోర్టులో గ్రూప్-1 బాధితుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అభ్యర్థులు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి నిరసన తెలపడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ప్రభుత్వం గ్రూప్-1 అభ్యర్థుల అభ్యంతరాలపై ..
రాష్ట్రంలో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతోందని, ఇందులో భాగంగానే జీవో 29 జారీ అయ్యిందని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు.
కేంద్రమంత్రి బండి సంజయ్, రేవంత్ రెడ్డి కావాలనే డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు.. బండి సంజయ్‌ని పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి మరి రేవంత్ ర్యాలీ చేయిస్తాడని అన్నారు. బీఆర్ఎస్ నాయకులను మాత్రమే రేవంత్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తుందని మండిపడ్డారు.
Telangana: జీవో నెంబర్ 29ని రద్దు చేసి జీవో నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చారు. వీరి నిరసనకు కేంద్రమంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. బండి సంజయ్‌తో పాటు బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున అశోక్‌నగర్ చేరుకుని ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ నిరసనకు దిగారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నగరంలోని అశోక్ నగర్ లైబ్రరీకి బండి సంజయ్ భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఇందులో సంజయ్ తో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన గ్రూప్-1 బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవి, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తాను చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ట్వీట్ చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వానికి మద్యంపై ఉన్న ధ్యాస రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ట్వీట్ చేశారు. మందుపై ఉన్న ధ్యాస మంచి బోధన, మందుబిళ్లలు, మూసీ బాధితులు, మంచినీళ్లపై లేదన్నారు.
రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించేయాలని కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కుట్రలు చేస్తున్నారని, తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.