Home » BCCI
శనివారం నాడు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడారు. ఐసీసీ సమావేశానికి పీసీబీ ఛైర్మన్ నఖ్వీ కూడా హాజరయ్యారని, అజెండాలో లేనప్పటికీ తాను, నఖ్వీ.. ఐసీసీ అధికారుల సమక్షంలో భేటీ అయ్యామని సైకియా అన్నారు. చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం బాగుందని, ఇరు పక్షాలూ ఈ సమావేశంలో సహృదయంతో పాల్గొన్నాయని తెలిపారు.
చిరస్మరణీయ విజయం సాధించిన భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఉంటుందని క్రికెట్ అభిమానులు భావించారు. కానీ వారిని బీసీసీఐ నిరాశకు గురి చేసింది. ఆదివారం కప్ గెలిస్తే... ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి విజయోత్సవ వేడుకలు నిర్వహించలేదు.
శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంగానే ఉన్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. వైద్యులు అనుకున్న దాని కంటే వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. శ్రేయస్ ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని.. భిన్నమైన వైద్య ప్రక్రియతో అంతర్గత రక్తస్రావం జరగకుండా వైద్యులు చూశారని తెలిపారు.
దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్నా.. వయస్సు ఎక్కువని తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాడి ఫామ్ కాకుండా వయసును చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాజాగా చత్తీస్‌గఢ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో అజింక్యా రహానే 159 పరుగులతో అదరగొట్టాడు.
ఆసియా కప్ ట్రోఫీని అప్పగించాలంటూ బీసీసీఐ పంపిన ఈమెయిల్‌కు ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ స్పందించారు. దుబాయ్‌కు వచ్చి తన నుంచి ట్రోఫీ తీసుకెళ్లాలని బదులిచ్చారు.
ఆసియా కప్ ట్రోఫీని అప్పగించాలంటూ ఏసీసీ చీఫ్, పాక్ మంత్రి మోసిన్ నఖ్వీకి బీసీసీఐ ఈమెయిల్ చేసింది. ట్రోఫీని అప్పగించకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది.
పాక్‌తో క్రికెట్ టోర్నీ నుంచి వైదొలగిన అప్ఘానిస్థాన్‌ను శివసేన యూబీటీ నేత ప్రియాంక చతుర్వేది ప్రశంసించారు. అప్ఘానిస్థాన్‌ను చూసి భారత ప్రభుత్వం, బీసీసీఐ నేర్చుకోవాలని చురకలంటించారు.
ఐపీఎల్ ద్వారా కోట్ల బిజినెస్ జరుగుతోంది. దీని ద్వారా బీసీసీఐకి ఏటా కోట్ల రూపాయాలు లాభం వస్తుంది. ఇది ఇలా ఉంటే..తాజాగా ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఓ బిగ్ షాక్ తగిలింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇండియా జట్టు మూడు వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ శనివారం స్క్వాడ్‌లను ప్రకటించింది.
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో టీమిండియా జట్టుకు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టాడు. అయితే, ఈ టూర్‌లో రోహిత్‌తో పాటు కోహ్లీ కూడా పాల్గొననున్నారు.