Home » Bengaluru News
గృహనిర్మాణ శాఖలో ఇళ్లు మంజూరు కావాలంటే లంచం ఇవ్వాల్సిందేనని సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనం కలిగించాయి. అయితే ఆ సంఘటన మరువకముందే బెళగావి జిల్లా కాగవాడ ఎమ్మెల్యే రాజుకాగె ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు.
రాయచూరుకు వస్తున్నాము అక్కడికే రండి కాసేపు మాట్లాడాలని సీఎం సిద్దరామయ్య ఫోన్ చేశారని, అయితే తాను రాలేనని వివరణ ఇచ్చినట్లు ఆళంద ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ తెలిపారు.
తుంగభద్ర జలాశయానికి వరదనీటి చేరిక రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే రోజూ 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ఇది రెండురోజుల నుంచి భారీగా పెరుగుతుండటంతో గత ఏడాది కొట్టుకుపోయిన 19వ క్రస్ట్‌గేట్ మరమ్మతు పనులు పూర్తిగా నిలిచిపోయాయి.
ప్రజలకోసం పోరాటం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్టీ నాయకులకు సూచించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరుకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను పలువురు సీనియర్ నేతలు భేటీ అయ్యారు.
హౌసింగ్‌శాఖలో ఇల్లు కేటాయించాలంటే లంచం ఇవ్వాల్సి వస్తోందని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీఆర్ పాటిల్(BR Patil), గృహనిర్మాణశాఖ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్ వ్యక్తిగత కార్యదర్శి సర్ఫరాజ్‌ఖాన్‌తో మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది.
విజయనగర జిల్లా, కమలాపురం చెరువులో చేపలు మృత్యువాత కారణంగా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో మంది మత్య్సకారులు జీవనం ఈ చెరువుపైనే ఆధార పడి ఉంది.
నమ్మ మెట్రో రైల్వే స్టేషన్‌లలో గుజరాత్‌కు చెందిన అమూల్ పాల ఉత్పత్తులు విక్రయించేందుకు అనుమతిలివ్వడంపై కన్నడిగులు మండి పడుతున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అమూల్ విక్రయాలను ప్రోత్సహించేలా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రస్తావించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.
Bengaluru Man: సోమవారం సాయంత్రం స్థానికులు రోషిణి శవాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్ర ప్రజల నుంచి అధిక పన్నులు వసూలు చేస్తూ, గ్యారంటీల పేరిట రాష్ట్రాన్ని నిలువు దోపిడీచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని జేడీఎస్ పార్టీ రాష్ట్ర యువఅధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి అన్నారు.
ఐపీఎల్ టోర్నీలో ఆర్సీబీ విజయోత్సవాలు హడావుడిగా జరపడమే తొక్కిసలాటకు కారణమని బీజేపీ మండిపడింది. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఫ్రీడంపార్కులో నిరసన చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్షనేతలు అశోక్, చలవాది నారాయణస్వామి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన సాగింది.