Home » Bengaluru News
పానీ పూరీ(Pani Puri) చూసి నోరు చప్పరిస్తున్నారా.. ఆగలేక పానీ పూరీ ఆరగించేస్తున్నారా. అయితే మీరు హాస్పిటల్ వెళ్లాల్సిన రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఈ మాట చెప్తున్నది మేం కాదు. వైద్యులే చెబుతున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుగా.. పానీపూరీని సైతం కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు
భారతీయ పరంపర, సంస్కృతి సంప్రదాయాలు పాటించే సమాజం మనది. జన్మకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో మృతి చెందాక అంతకుమించి సంప్రదాయాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అభివృద్ధి చెందిన దేశాలు లేదా ఉన్నత హోదాలలో ఉండేవారు మాత్రమే దేహదానం (టోటల్బాడీ డోనార్) చేస్తారు.
కేంద్రప్రభుత్వం అమలులోకి తెచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు దేశవ్యాప్తంగా ప్రారంభమైన రోజే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈనెల 15 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో మూడు కొత్త చట్టాల్లో సవరణలు తీసుకురానున్నట్లు రాష్ట్ర న్యాయ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్(Minister HK Patil) తెలిపారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై పలువురు స్వామిజీల వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్(Senior BJP MLA Basanagowda Patil Yatnal) తీవ్రంగా మండిపడ్డారు. స్వామిజీలకు మఠాలలో కూర్చోవడం తప్ప మరేమీ పనిలేదా అంటూ వ్యాఖ్యానించారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్(Siddaramaiah and DK Shivakumar)ను క్రికెటర్లు రోహిత్‌శర్మ, విరాట్కోహ్లితో పోల్చిన వచనానందస్వామిజీపై విరుచుకుపడ్డారు.
విశ్వ ఒక్కలిగ మహా సంస్థానం మఠాధిపతి చంద్రశేఖరస్వామిజీ(Chandrasekharaswamyji) రెండు రోజుల వ్యవధిలో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెంపేగౌడ జయంతిలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) సభలో ఉండగానే సీఎం పదవికి రాజీనామా చేసి డీకే శివకుమార్‌కు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అంతా సమైక్యంగా ఉన్నామనేలా కనిపించిన కాంగ్రెస్ నాయకుల మధ్య ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ఎవరికివారుగా చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వంలో కీలక సారథుల మధ్య ఎత్తులు పైఎత్తులు సాగుతున్నాయి. ఏడాది పాలన ముగియడం, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో మళ్లీ ముసుగు రాజకీయాలు తీవ్రమవుతున్నాయి.
అసహజ లైంగిక దౌర్జన్యం ఆరోపణతో అరెస్టయిన జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ కేసులో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది.
నీట్ అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను స్వీకరించిన సీబీఐ జోరు పెంచింది. బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ అవకతవకలకు సంబంధించి నమోదైన ఒక్కో కేసును రీ-రిజిస్టర్ చేసింది.
అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి భూమి మీదికి తీసుకొచ్చే ప్రక్రియలో ‘హ్యాట్రిక్’ విజయాన్ని సాధించినట్టు ఇస్రో వెల్లడించింది.