Home » Bengaluru News
మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ హోమోసెక్స్ కేసులో అరెస్టయ్యారు. అసహజ లైంగిక దౌర్జన్యం వివాదంలో సాక్ష్యాలను పోలీసులకు వివరించేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ సూరజ్‌ను హొళెనరసీపుర పోలీసులు శనివారం రాత్రంతా విచారించారు.
కర్ణాటక ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తమ ట్రస్టు పేరిట ఉన్న భూములను ఆక్రమించారని ఆమెపై ప్రముఖ బాలీవుడ్ సింగర్ లక్కీ అలి కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
అనుచిత ఫోన్ కాల్స్‌తో విసిగిపోయిన ఓ మహిళ తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్(Railway stations, bus stand) టాయ్లెట్లలో మొబైల్ నెంబర్ రాసి అమ్మాయిలు కావాలా.. సంప్రదించండి అనే రాతలు తరచూ చూస్తుంటాం.
గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో మే ఆఖరి, జూన్ మొదటి వారంలో కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడ్డాయి. కాని తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు వరద నీరు చేరలేదు.
రాష్ట్రంలో ఏడాది పాలన ముగియగానే తొలి వికెట్‌గా వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో రూ.187కోట్ల అవినీతిలో మంత్రి నాగేంద్ర రాజీనామా చేశారని, ఇక రెండో వికెట్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యే అని ప్రతిపక్షనేత అశోక్(Ashok) సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని(Renukaswamy) హత్య చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వీరశైవ జంగమ సమాజం నాయకులు డిమాండ్ చేశారు. రేణుకాస్వామిని హత్యను నిరశిస్తు వీరశైవ జంగమ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం లింగసుగూరు పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
బెంగళూరు ఆస్టర్ ఆసుపత్రి వైద్యులు ఓ ఐటీ ఉద్యోగికి రెండుసార్లు గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
శాసనసభ్యుల కోటాలో విధానపరిషత్ సభ్యుడిగా ఎన్నికైన జగదీశ్ శెట్టర్(Jagdish Shettar) రాజీనామాతో ఖాళీ అయిన ఒక స్థానానికి జూలై 12న ఎన్నికల నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది.
ఈవీఎంల కారణంగానే జేడీఎస్, బీజేపీలకు ఆశించినంతకంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలు వచ్చాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) ఆరోపించారు. బీబీఎంపీ కార్యాలయంలో గ్యారెంటీల అమలు కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
బెంగళూర్‌కు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. మంగళవారం వచ్చింది. ఎందుకైనా మంచిదని ఆర్డర్ తీసే సమయంలో వీడియో తీశారు. ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరో వస్తువు వస్తున్నాయి. జాగ్రత్త పడి వీడియో తీశారు. బాక్స్‌కు ఉన్న టేప్ తీసే క్రమంలో పామును గుర్తించారు.