Home » Bengaluru News
బెంగళూర్‌కు చెందిన దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. మంగళవారం వచ్చింది. ఎందుకైనా మంచిదని ఆర్డర్ తీసే సమయంలో వీడియో తీశారు. ఒక వస్తువు ఆర్డర్ చేస్తే మరో వస్తువు వస్తున్నాయి. జాగ్రత్త పడి వీడియో తీశారు. బాక్స్‌కు ఉన్న టేప్ తీసే క్రమంలో పామును గుర్తించారు.
ఈ యేడాది తుంగ జలాశయం(Tunga Reservoir) కనివినీ ఎరుగని రీతిలో భారీ వర్షాల ప్రభావం వల్ల నిండిపోవడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తుంగభద్ర జలాశయానికి కూడా జూన్ నెలలోనే 4 వేల క్యూసెక్కులకు పైగా రావడంతో రైతన్నలు నారుమళ్లు చల్లుకోవడానికి సిద్ధమయ్యారు.
కన్నడ నటుడు దర్శన్, నటి పవిత్రగౌడ్‌ను పెళ్లి చేసుకోలేదని దర్శన్ న్యాయవాది అనీల్‌బాబు స్పష్టం చేశారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్ అధికారులు పవిత్రను దర్శన్ రెండో భార్యగా పేర్కొంటున్న నేపథ్యంలో
ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు ఉండాలని, 60 మంది ఎమ్మెల్యేల రాజీనామా అంటే పిల్ల చేష్టలా..? అని భారీ పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్(Minister MB Patil) పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుతానికి సీఎం స్థానంలో సిద్దరామయ్య ఉన్నారని, ఆ కుర్చీ ఖాళీగా లేదని, ఆ ప్రశ్నే రాదన్నారు.
నటుడు దర్శన్‌పై నమోదైన హత్యకేసు విచారణలో పలు విషయాలు బహిర్గతమవుతున్నాయి. బహచిత్రదుర్గ నివాసి రేణుకాస్వామిని హత్య చేసి, ఆ నేరాన్ని ఒప్పుకునేందుకు నలుగురు యువకులకు రూ.30లక్షలు ఇచ్చేలా డీల్ కుదిరినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యడియూరప్పపై బెంగళూరు కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. సాయం కోసం కుమార్తె(17)తో కలిసి తాను ఈఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్ప ఇంటికి వెళ్లగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సదాశివనగర్ పోలీసులు మార్చి 14న ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.
కస్టడీలో ఉన్న ప్రముఖ సినీ నటుడు దర్శన్(Film actor Darshan) సహా నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(Renukaswamy) హత్య కేసులో పలు కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రాష్ట్రాల జీవనాడిగా నిలిచిన తుంగభద్ర(Tungabhadra) ఇప్పుడిప్పుడే జల కళ సంతరించుకుంటోంది. రుతుపవనాల కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇకపై సినిమాలకు గుడ్‌బై చెబుతున్నానని, పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతానని జేడీఎస్ యువ విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి(Nikhil Kumaraswamy) తెలిపారు. మండ్యలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక సినిమాలు చేయదలచుకోలేదని అన్నారు. పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని తెలిపారు.
బెంగళూరు గ్రామీణ నియోజకవర్గం ఓటమికి వ్యక్తిగతంగా తనదే బాధ్యత అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) తెలిపారు. నగరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బెంగళూరు గ్రామీణ నుంచి తన తమ్ముడు డీకే సురేశ్(DK Suresh) ఓటమికి తన వ్యక్తిగత బాధ్యతగా భావిస్తున్నా అన్నారు.