Home » Bengaluru News
ముడా వివాదంలో సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah)కు కేసుల కష్టాలు బిగుసుకుంటున్న తరుణంలో మంత్రుల రహస్యభేటీ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. కారణాలు ఏవైనా రహస్యంగా సమావేశం కావడం పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులను విస్మయం కలిగిస్తోంది.
‘ముడా’ వ్యవహారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) మెడకు చుట్టుకుంది. ఆయన భార్యే స్థలాలలు వద్దని వాపసు చేయడంతో ఆయన మరింత ఇరుక్కుపోయినట్లయ్యింది. ఇంటి స్థలాల వివాదం సీఎం సిద్దరామయ్య కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలోనే అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య భార్య పార్వతికి భూసమీకరణలో పరిహారం కింద ఇచ్చిన 14 ప్లాట్ల కేటాయింపును ముడా(మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) రద్దు చేసింది.
డీ నోటిఫికేషన్ వివాదంలో లోకాయుక్త విచారణకు కేంద్రమంత్రి కుమారస్వామి(Union Minister Kumaraswamy) హాజరయ్యారు. గంగేనహళ్ళి డీ నోటిఫికేషన్‌కు సంబంధించి లోకాయుక్త పోలీసులు కుమారస్వామికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఢిల్లీ నుంచి వచ్చిన కుమారస్వామి ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా లోకాయుక్త కార్యాలయానికి వెళ్లారు.
ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి.
కర్ణాటకలో మహాలక్ష్మి అనే మహిళను హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచిన ఘటనలో నిందితుడు ముక్తిరంజన్ ఒడిశాలోని తన స్వగ్రామంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
రాష్ట్రం కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసులకు సంబంధించి సీబీఐ(CBI) నేరుగా విచారణ జరిపే ప్రక్రియకు చెక్ పెట్టేలా తీర్మానించింది. గురువారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 28 అంశాలు కేబినెట్ ముందు ప్రస్తావనకు రాగా రెండింటిని పెండింగ్‌లో పెట్టారు.
తన అభిమాన నటుడికి గుడి కట్టించాడు ఆ అభిమాని. హావేరి జిల్లా యలగచ్చ గ్రామంలో దివంగత పునీత్‌రాజ్‌కుమార్(Puneeth Rajkumar) పేరిట నిర్మించిన ఆలయాన్ని అశ్విని పునీత్ రాజ్‌కుమార్(Ashwini Puneeth Rajkumar) గురువారం లాంఛనంగా ప్రారంభించారు.
కర్ణాటకలో కేసుల విచారణకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీబీఐని అనుమతించరాదని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టు షాక్ ఇచ్చింది. మైసూర్ పట్టణాభివృద్ధి సంస్థ(ముడా) ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణంలో సీఎంను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సమర్థించింది.