Home » Bhadradri Kothagudem
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ రియల్ వ్యాపారం జోరు తగ్గలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచే అత్యధిక ఆదాయం సమకూరింది. ఈ జిల్లాల్లో డాక్యుమెంట్ల నమోదు కూడా ఎక్కువగానే ఉంటుంది.
కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరోసారి సందడి చేశారు. కేసులతో బిజీగా ఉన్న ఆయన రిలాక్స్‌గా తెలుగు పాటలకు మాస్ స్టెప్లేసి ఆదరగొట్టారు. ఎస్పీ డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బూటకపు ఎన్కౌంటర్లను హెచ్చరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోలు శుక్రవారం లేఖ రాశారు. అల్లూరి డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్ట్ పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. భారత విప్లవోద్యమం నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక దాడిని ఓడిద్దామని పిలుపునిచ్చారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను దొరక బట్టి చంపుతున్నారని.. బూటకపు ఎన్కౌంటర్లను నిజమైన ఎన్‌కౌంటర్లగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో పోలింగ్ వేళ అపశృతి చోటు చేసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు.
ఓ చోరీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ ఎస్ఐ, కానిస్టేబుల్, సీసీటెక్నీషియన్, మరో ఘటనలో ఎల్ఆర్ఎస్(LRS) కోసం లంచం(Bribe) తీసుకుంటూ టౌన్‌ప్లానింగ్ సూపర్ వైజర్ ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. భద్రాచలంలో(Bhadrachalam) ఈనెల 12న పాత మార్కెట్ గోడౌన్లో మర్రి సాయితేజ, మరో ఇద్దరు మిత్రులతో కలిసి నాలుగు చెక్కర బ్యాగులను దొంగతనం చేశాడు. స్టేషన్లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ..
Bhadrachalam Ram Navami LIVE: భద్రాచల క్షేత్రంలో(Bhadrachalam) మహా కమనీయ ఘట్టం.. రాములోరు, సీతమ్మ కళ్యాణమే! ఆ శుభ ముహూర్తం వచ్చేసింది. ఇవాళే సీతారాముల కళ్యాణం(Seetharamula Kalyanam)! శీరామ నవమి(Ram Navaami 2024) సందర్భంగా ఈ మహాద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భద్రాచలానికి చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల కోడ్ ఉండటంతో కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భద్రాచలం వెళ్లడం..
భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా బుధవారం భద్రాచల క్షేత్రం రామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. రామయ్య కళ్యాణం కోసం భద్రాద్రి అంగరంగ వైభవంగా ముస్తాబైంది. రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరుగుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో రెండవ రోజు బుధవారం వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మండల లేఖ, కుండ, కలశ, యాగశాల అలంకరణ జరగనుంది. సాయంత్రం సార్వభౌమ వాహన సేవ జరుగుతుంది.
శ్రీరామనవమి పర్వదినం సమీపిస్తున్న తరుణంలో ఉత్సవాలకు భద్రాద్రి ( Bhadrachalam ) రామయ్య సిద్ధమవుతున్నాడు. నేడు సీతారాముల కళ్యాణ పనులకు అంకురార్పణ జరగనుంది.
Telangana: భద్రాచలంలో ‘‘ఇందిరమ్మ ఇళ్లు’’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాముల వారు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఐదోది. అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. తాజాగా ఐదో పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా కార్యరూపం దాల్చింది.