Home » Bharat Ratna
'మహా వికాస్ అఘాడి'లోని తమ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్‌కు ఉద్ధవ్ థాకరే హితవు పలుకుతూ, సావర్కర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ మాట్లాడటం మానుకోవాలని, బీజేపీ సైతం నెహ్రూను టార్గెట్ చేసి మాట్లాడవద్దని అన్నారు.
దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణికి ప్రదానం చేస్తున్న సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలుచుని ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూర్చుని ఉండటంపై జార్ఖాండ్ ముక్తి మోర్చా ఆక్షేపణ తెలిపింది. ఆమె గిరిజన మహిళ అయినందునే రాష్ట్రపతిని ప్రధాని అవమానించారని విమర్శించింది.
భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అడ్వాణీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం ''భారత రత్న'' ప్రదానం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆదివారం ఉదయం స్వయంగా అడ్వాణీ ఇంటికి వెళ్లి ఈ అవార్డును అందజేశారు.
న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని, బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీనియర్ రాజకీయ నేత ఎల్‌కే అద్వానీకి ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత రత్న అవార్డు ప్రదానం చేయనున్నారు. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన బయటికి రాలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అద్వానీ నివాసంలోనే అవార్డు ప్రదానం చేయాలని నిర్ణయించారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు.
బీజేపీ సీనియర్ నేత ఎల్ కె అద్వానీ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుతో పాటు.. మరో ముగ్గురికి ఈరోజు భారత రత్నలు ప్రదానం చేయనున్నారు.
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని.. అయితే కాంగ్రెస్ ఈ విషయంపై హర్షం ప్రకటించలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు(BJP MP GVL Narasimha Rao) అన్నారు.
దక్షిణాది నుంచి తొలిసారిగా భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడమేగాక దేశానికి ఆర్థిక సంస్కరణల పథాన్ని వేసిన తెలుగుబిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. పీవీతోపాటు మరో
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇంగ్లీష్ రాదా..? ఎందుకు కనీసం నోరు మెదపలేదు..? జాతీయ మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే కనీసం స్పందించలేదేం..? ఇంతకీ ఇంగ్లీష్ వచ్చా.. రాదా..? ఇప్పుడిదే అటు సోషల్ మీడియాలో.. ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో జరుగుతున్న పెద్ద చర్చ. అసలేం జరిగిందో తెలిస్తే నవ్వుకుంటారేమో. ఇక ఆలస్యమెందుకు రండి మీ కళ్లతో చూసి.. చెవులారా విని తరించండి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న ఇవ్వడం తెలుగు ప్రజలందరూ సంతోషించే విషయమని బీజేపీ ఎంపీ అరవింద్(Aravind) అన్నారు.