Home » Bharath
భారత్ రైస్(Bharat Rice) మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. కొన్ని ప్రైవేట్ సంస్థలు, వ్యాపారుల ద్వారా విక్రయాలు మొదలయ్యాయి. నేషనల్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్)(NAFED), నేషనల్ కో–ఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ వంటి సంస్థలకు కేంద్రం విక్రయ బాధ్యతలను..
భారతదేశంపై అమెరికా రాయబరి ఎరిక్ గార్సెట్టి ప్రశంసలు కురిపించారు. ప్రపంచ భవిష్యత్ తీర్చిదిద్దడంలో భారతదేశం ముఖ్యపాత్ర పోషిస్తుందని వివరించారు. భవిష్యత్‌ను ఆస్వాదించాలని అనుకుంటే భారత్ రండి, ఇక్కడ పనిచేయాలని పిలుపునిచ్చారు.
మాల్దీవులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి పరిమిత స్థాయిలో బియ్యం, గోధుమలు సహా పలు నిత్యావసర వస్తువుల ఎగుమతికి భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వస్తువుల ఎగుమతిపై ఏప్రిల్ 1 నుంచి 2024-25 సంవత్సరానికి నిషేధం ఉంది. అయితే ఇప్పుడు మాల్దీవులు చేసిన విజ్ఞప్తిపై ఆ దేశానికి నిత్యావసర వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది.
లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) కచ్చతీవు దీవులపై చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షమైన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని తీవ్ర వ్యా్ఖ్యలు చేశారు.
భారత ఆర్థిక వ్యవస్థకు(Indias economy) మంచి రోజులోచ్చాయా? అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే తాజాగా 2024లో భారత ఆర్థిక వ్యవస్థ 7.5 శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా(forecasts) వేసింది. ప్రపంచ బ్యాంకు(World Bank) ఇంతకుముందు ఈ అంచనాను 6.3 వద్ద ఉంచడం విశేషం. అది ఇప్పుడు ఏకంగా 7.5కి పెంచింది.
వాస్తవాధీన రేఖ వద్ద డ్రాగన్ దేశం నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఈ చర్యను భారత్ ( India ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇలా ఇప్పడే కాదు గతంలోనూ పలు మార్లు పేర్లు మారుస్తూ మూడు జాబితాలను రిలీజ్ చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా చైనా, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇండియాలోని కొన్ని ప్రాంతాలకు డ్రాగన్ కంట్రీ పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన భారత్ ఇలాంటి చర్యలు మానుకోవాలని చైనాకు సూచించింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని, చైనా పెడుతున్న ఈ పేర్లు వాస్తవాలను మార్చలేదని భారత్ ఘాటుగా స్పందించింది.
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని భారత్ ఖండించింది. 133 మందిని బలిగొన్న మారణకాండను తీవ్రంగా పరిగణించింది. రష్యా ( Russia ) ప్రజలకు, ప్రభుత్వానికి భారతదేశం బాసటగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
వరల్డ్ హ్యాపీనెస్ 2024 రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా ఏడవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎంపికైంది.
ముంబైలో జరిగిన మిస్ వరల్డ్ 2024 పోటీల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టినా పిస్కోవా కిరీటం గెలుచుకుంది. ఇక భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సిని శైట్టి ఏ ర్యాంకులో ఉందో ఇక్కడ చుద్దాం.