Home » Bhatti Vikramarka Mallu
గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి ఇప్పటివరకూ రూ.66,722 కోట్లు బ్యాంకులకు చెల్లించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మీరూ అప్పులు చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని అంటున్నారు, వాళ్లు దోచుకోటానికి అప్పులు చేస్తే తాము ప్రజల కష్టాలు తీర్చేందుకు అప్పులు చేస్తున్నామని ఆయన చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాఠశాలలు, హాస్టళ్ల మెనూ ఛార్జీలను పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అదే పెద్దలు నేడు పాఠశాలలు సందర్శించి భోజనం బాగోలేదంటూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో 2030 నాటికి 20 గిగావాట్ల హరిత విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
సోమవారం నుంచి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఉన్న ముఖ్యమైన బిల్లులు, కీలక అంశాలపై చర్చించేందుకు ఆదివారం సాయంత్రం క్యాబినెట్ సమావేశం ఉంటుందనే చర్చ అధికారుల్లో జరుగుతోంది.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు బాధ్యత ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను అమలు పరిచి ముందుకువెళ్తున్నామని తెలిపారు. ఏడాది పాలన ప్రచారంలో ఎంపీలను భాగస్వాములు కావాలని కోరారు.
తమ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టిందని.. అందుకే ప్రచారంలో వెనుకబడ్డమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ పాలన కంటే మెరుగైన పాలనను తమ ప్రభుత్వంలో అందిస్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతున్నారని విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. గత పదేళ్లు అధికారంలో ఉండి అధికారికంగా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ ప్రజల మనోభావాలకు అద్దం పడుతుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విగ్రహ ఆవిష్కరణ పండుగ.. ప్రజల గుండెల్లో మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు.
సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేసి తీరుతామని, ఇందుకు కావాల్సిన నిధులు సమకూర్చుకుంటున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పులకు అదనపు ఆదాయం కలిపి బ్యాంకులకు కట్టే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలకు రూ.61 వేల కోట్లు వెచ్చించామని తెలిపారు.