Home » Bhatti Vikramarka Mallu
రాష్ట్రంలో 8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరును సమీక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో అధిష్ఠానం భేటీ కానుంది.
ప్రజా భవన్లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. లెక్కలు కాదు ఆత్మ ఉండాలన్నారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం నేటి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని అన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో బ్యాంకర్లది కీలకపాత్ర అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. రైతుల ఖాతాల్లో తప్పులు సరిదిద్ది వారికి లబ్ధి చేకూరేలా చేయాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని ఆయన చెప్పారు.
తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్‌రెడ్డికి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలలను ప్రపంచ పటంలో ఉంచాలని, వాటిని ప్రాచుర్యంలోకి టీసుకొచ్చి బుద్దిస్ట్‌లను ఇక్కడికి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం పాలేరు నియోజకవర్గం, నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్థూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.
పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి సినీ నటులు, ఎంబీయూ ఛాన్స్లర్ మంచు మోహన్ బాబు జీవితం నిదర్శనమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు. చంద్రగిరిలో శ్రీ విద్యానికేతన్ 13వ గ్రాడ్యుయేషన్ డే, ఎంబీయూ మొదటి స్నాతకోత్సవ వేడుకలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి.
జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ ఉత్పత్తికి చీఫ్ ఇంజినీర్లు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నందున వీలైనంత ఎక్కువ ఉత్పత్తిపై థర్మల్, హైడల్ ప్రాజెక్టుల సీఈలు దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
గ్రేటర్లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేస్తూ, వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, విద్యుత్‌శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Minister Bhatti Vikramarka) తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అదేశించారు. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.
రైతు రుణమాఫీ మూలంగా బ్యాంకర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరిందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. సోమవారం నాడు మధిరలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.