Home » Bhumana Karunakar Reddy
Andhrapradesh: సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఇవ్వడంతో తమకు నమ్మకం ఏర్పడింది. శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయని భూమన అన్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ అంశం తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సోమవారం అత్యుత్సాహం ప్రదర్శించారు. తిరుమలలో రెచ్చగొట్టేలా ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనంటూనే నిబంధనలను ఉల్లఘించి మాట్లాడారు.
తిరుమల లడ్డూ కల్తీపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి అన్నారు.
వైసీసీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేశారు. కరుణాకర్‌రెడ్డి రాజీనామాను దేవాదాయ శాఖ కార్యదర్శి కరికాల వల్లవన్ ఆమోదించారు. ఈ మేకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి: ఎన్నికల సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఆంధ్రజ్యోతిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరి పేర్లు చెప్పి వారి అంతు చూస్తానని కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. దీంతో ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి టీటీడీ చైర్మన్ వ్యాఖ్యలను ఖండించారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి(YSRCP) రాష్ట్ర వ్యాప్తంగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా తిరుపతికి చెందిన పలువురు కీలక ప్రజాప్రతినిధులు, నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ, జనసేన కండువా కప్పుకుంటున్నారు.
తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల (Aranii Srenevasulu)పై వైసీపీ (YSRCP) నేతలు దాడికి పాల్పడ్డారు. శనివారం నాడు గిరిపురంలో శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రచారం చేస్తుండగా వైసీపీ నాయకులు పోటీగా ప్రచారం చేశారు.
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy) తన కుమారుడి కోసం ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని.. వెంటనే ఆయనను ఆ పదవీ నుంచి తొలగించాలని బీజేపీ (BJP) నేత భానుప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) డిమాండ్ చేశారు. గురువారం నాడు ఏపీ సీఈఓ కార్యాలయంలో కరుణాకర్ రెడ్డిపై తెలుగుదేశం - బీజేపీ జనసేన కూటమి నేతలు ఫిర్యాదు చేశారు.
Andhrapradesh: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సోమవారం ఉదయం సమావేశమైంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. స్విమ్స్ ఆస్పత్రిలో 479 నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
Andhrapradesh: తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ స్పందిస్తూ.. ఆయనపై చర్యలు తీసుకుంది. ఈరోజు (సోమవారం) జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో రమణ దీక్షులుపై కీలక నిర్ణయం తీసుకుంది...