Home » Bhupalpalle
కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ) కోసం భూములు ఇచ్చి రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న ఆ కుటుంబాలు మాత్రం చీకట్లలో మగ్గుతున్నాయి. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికీ ఉద్యోగం ఇస్తామన్న కేటీపీపీ... తన హామీని తుంగలో తొక్కడంతో నిర్వాసితులు 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు.
తెలంగాణలో మరో నీటిపారుదల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సాయం అందనుంది. జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో చిన్నకాళేశ్వరం(ముక్తేశ్వర్) ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం పచ్చజెండా ఊపింది.
మావోయిస్టుల ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఛత్తీ్సగఢ్లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యం పాగా వేయనుంది.
విదేశాల్లో ఉన్నతోదోగ్యం చేయాలనే ఆ యువకుడి కల నెరవేరలేదు. వీసా కోసం దరఖాస్తు చేసుకోగా అది రిజెక్ట్ అయింది. ఆ ఆవేదనతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఆస్తి కోసం ఓ కుమార్తె తండ్రినే పొట్టనపెట్టుకుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్మార్క్స్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుల వైఫల్యంపై భూపాలపల్లి జిల్లా కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజీలో జరిగిన నష్టంపై ప్రైవేటు పిటిషన్ను విచారించిన భూపాలపల్లి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు తాఖీదులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడత కేటాయింపుల్లో భాగంగా నెలరోజుల్లోపు 4.5 లక్షల ఇళ్లు మంజూరుచేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు తొలి విడతలోనే నియోజకవర్గానికి 3,500 ఇళ్లను యుద్ధ ప్రతిపాదికన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత, సినీ గేయ రచయిత కనుకుంట్ల చంద్రబోస్(Kankuntla Chandra Bose) తన గ్రామ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలో సొంత నిధులతో ఆస్కార్ పేరిట ఓ గ్రంథాలయాన్ని నిర్మించారు.
తెలంగాణలోని పది జిల్లాల్లో గర్భస్రావాల (అబార్షన్లు) శాతం అధికంగా ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు అన్ని జిల్లాల్లో నమోదైన గర్భిణుల్లో 10 శాతం మందికి అబార్షన్లు అయినట్లు తేలింది. ఈ విషయాన్ని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఈ ఐదు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 2,84,208 మంది గర్భిణులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలేబ్యారేజీలను దెబ్బతీశాయా? అవసరమైన సర్వేలు నిర్వహించి, నిర్ధారిత ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ పదేళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం మూడేళ్ల వ్యవధిలోనే హడావుడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటుకు కారణమా?