Home » Bihar
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. జాతీయ రహదారిపై ఓ ఆయిల్ ట్యాంకర్ను చూసి అంతా అవాక్కవుతున్నారు. ట్యాంకర్పై అనుమానం రావడంతో కొందరు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చివరకు అందులో పరిశీలిచంగా.. షాకింగ్ సీన్ కనిపించింది...
బీహార్ రాజధాని పాట్నాలో కొత్తగా ఎంపికైన పోలీస్ ఉన్నతాధికారులకు పట్టాలు అందజేసే కార్యక్రమానికి సీఎం నీతీశ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం నీతీశ్ కుమార్ వ్యవహరించిన తీరు.. అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఓ గ్రామంలో అనుకోకుండా ఓ వ్యక్తి మరణించాడు. అదే క్రమంలో వరదల కారణంగా శ్మశానవాటిక నీటితో నిండిపోయింది. అదే సమయంలో అంత్యక్రియల కోసం స్థానికులు ఓ పెద్ద థర్మాకోల్ పడవలో పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఆ పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఎలాంటి మారణాయుధాలు ఉపయోగించకుండా ప్రజలు కష్టపడి సంపాదించిన నగదును దోచుకోగలే నైపుణ్యం నట్వర్లాల్కే ఉంది. అతను ఇప్పటివరకు దాదాపు పదిసార్లు జైలు నుండి తప్పించుకుని అతిపెద్ద మోసగాడిగా చరిత్రలో నిలిచాడు.
సాధారణంగా ఏదైనా పాము కనిపిస్తే చాలు పరిగెత్తుకెళ్తాం. కానీ ఓ వ్యక్తి మాత్రం ప్రమాదకర విషసర్పం కాటేసినా కూడా తగ్గేదేలే అంటూ ఏ మాత్రం భయపడకుండా దానిని తీసుకుని ఆస్పత్రికి వెళ్లి హల్చల్ సృష్టించాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చెక్కర్లు కోడుతోంది.
ఏనుగులు చూసేందుకు ఎంత భారీగా కనిపిస్తుంటాయో.. వాటికి కోపం వచ్చిన సందర్భాల్లో అంతే స్థాయిలో బీభత్సం కూడా చేస్తుంటాయి. అడవుల నుంచి జనావాసాలు, పంటపొలాల్లోకి చొరబడే ఏనుగులు హల్చల్ చేయడం చూస్తుంటాం. అలాగే మావటి సంరక్షణలో పెరిగే ఏనుగులు కూడా కొన్నిసార్లు..
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పై భారతీయ జనతా పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అధికారిక నివాసాన్ని తేజస్వి ఖాళీ చేసే సమయంలో అనేక వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించింది.
అన్నెంపున్నెం ఎరుగని వయసులో అత్యాచారాల బారిన పడుతున్న పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి... ఇదీ బిహార్ ప్రభుత్వ టీచర్ కుష్బూ కుమారి తపన. ‘మంచి స్పర్శ-చెడు స్పర్శ’ గురించి ఆమె రూపొందించిన పాఠం... వేరే రాష్ట్ర విద్యాశాఖకు మార్గదర్శకమయింది.
భూములకు ఉద్యోగాల కుంభకోణంలో ఢిల్లీ కోర్టు ముందు లాలూ ప్రసాద్ సోమవారంనాడు హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పాట్నా నుంచి ఢిల్లీకి విమానంలో బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడారు.
ఆదివారం ఉదయం ఏడుగురు పిల్లలు స్నానం కోసం నీటిలో దిగారని, వారంతా లోతు ప్రాంతంలోకి వెళ్లడంతో ఒక్కసారిగా మునిగిపోయారని చెబుతున్నారు. విషయం తెలిసిన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి ఐదు మృతదేహాలను వెలికితీశారు.