Home » BJP
సమసమాజ స్థాపన కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఇదే విషయం నడుస్తోంది. వారసత్వ హక్కుగా రావాల్సిన ఆస్తిని చెల్లికి దక్కకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఢిల్లీకి మూటలు మో యడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ఎత్తుకుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి(Former MLA Chinthala Ramchandra Reddy) ఆరోపించారు. సోమవారం మన్నెగూడకు వచ్చిన ఆయన పార్టీ అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణిరుద్రమ, బండారు విజయలక్ష్మి, సునితతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక నియంతలా ప్రవర్తిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు.
బీజేపీ సీనియర్ కార్యకర్త కామిశెట్టి కృష్ణమూర్తి హత్యకు వైసీపీ ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు మండిపడ్డారు. రోడ్లు, భవనాల అతిథిగృహంలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణమూర్తి హత్యకు దారితీసిన కారణాలను సందిరెడ్డి వివరించారు.
నాగాలాండ్ రాష్ట్రంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటిస్తున్నారు. నాగాలాండ్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అధికారులతో కలిసి బండి సంజయ్ సమీక్షించారు.
తాను ఎన్నో యుద్ధాలు చూశానని.. కానీ, ఇలాంటి యుద్ధం నేనెప్పుడూ చూడలేదంటూ సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి పాలనపై బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణలు విమర్శలు గుప్పించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే శాంతి భద్రతలు లేవని డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ అంటే ఏమిటో ఈ సర్కార్కు చూపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీలో చేరిన అనంతరం గెహ్లాట్ మాట్లాడుతూ, ఎవరి ఒత్తిళ్లతోనో రాత్రికి రాత్రి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొందరి భావనగా ఉందని, వారికి నేను చెప్పదలచుకున్నది ఒక్కటేనని, ఏనాడూ తాను ఒత్తిళ్లకు లొంగి నిర్ణయాలు తీసుకున్నది లేదని అన్నారు.
లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలిపారు.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని.. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు.