Home » Bonda Umamaheswara Rao
Andhrparadesh: ముఖ్యమంత్రి జగన్కు ఉన్న డబ్బు పిచ్చి వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా.. కమీషన్లకు కక్కుర్తి పడి పనులు ఆపేశారన్నారు. జగన్ దెబ్బకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు ఏపీ వైపు చూసేందుకు భయపడిపోతున్నారన్నారు.
Andhrapradesh: రాష్ట్రంలో ఐదేళ్లు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత బోండా ఉమా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక, నామినేషన్లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు.
Andhrapradesh: గులకరాయి కేసులో కావాలనే బోండా ఉమాను వేధిస్తున్నారని ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీయే కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన బోండా ఉమాను జగన్ కావాలనే వేధిస్తున్నారన్నారు. సీపీ ప్రకటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఎన్నికల నిభంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే గవర్న్కు ఫిర్యాదు చేశామని..
Andhrapradesh: ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేందుకు పోలీసులను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందోని ఎన్నికల కమిషన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈసీకి వర్ల లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైసీపీ చేతిలో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందన్నారు. ప్రత్యర్ధులను వేధించడానికి పోలీసులను వైసీపీ అభ్యర్థులు అస్త్రంగా చేసుకున్నారని ఆరోపించారు.
ఎన్నికల కోడ్ వచ్చాక కూడా వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే ఉన్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ పేర్కొన్నారు. నామినేషన్ వేసిన తనను నిత్యం వేధిస్తూనే ఉన్నారన్నారు. నిన్న తనపై ఓ యుద్ధానికి వచ్చినట్టు పోలీసులను పంపారన్నారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద తప్పుడు కేసులు పెట్టినట్టు.. ఇప్పుడు తనపై కూడా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
గులకరాయి దాడి ఘటనలో మలుపులు తిరుగుతున్న దర్యాప్తు ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొండా ఉమా మహేశ్వరరావు వైపు వెళ్తుందా? కేసులో ఆయనను నిందితుడిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా?
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై గులకరాయి దాడి ఘటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమాను ఇరింకేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాలకు సమాచారం అందింది. అయితే కావాలని టీడీపీ నేతలను ఇరికించేందకు యత్నిస్తున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడితున్నాయి. ఈ క్రమంలో గులకరాయి ఘటనకు సంబంధించి బొండో ఉమా స్పష్టతనిచ్చారు. సీఎంపై రాయి దాడి ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
సీఎం జగన్పై రాయి దాడి ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. నాలుగు రోజులైనా.. నిందితులెవరో పోలీసులు చెప్పకపోవడం.. విచారణ పేరుతో జాప్యం చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ప్రజల్లో అనేక అనుమానాలు కలుగు తున్నట్లు తెలుస్తోంది. ఓ సీఎంపై రాయి విసిరిన వ్యక్తిని గుర్తించడానికి ఎందుకిత ఆలస్యం అవుతుందనేది మొదటి ప్రశ్న అయితే..
విజయవాడ: టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు బీసీ డిక్లరేషన్ వడ్డెర కోసం ‘ వడ్డెర్లకు అండ.. తెలుగుదేశం జెండా’ కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళ దాడి ఘటనను ఎలాగైనా టీడీపీ నేతల మెడకు చుట్టి తద్వారా లబ్ది పొందాలని అధికార పక్షం విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమపై గురి పెట్టనున్నట్టు తెలుస్తోంది. బోండా ఉమను టార్గెట్ చేశారని టీడీపీ వర్గాలకు సమాచారం అందింది.