Home » BRS
బీఆర్‌ఎస్‌నుంచి కాంగ్రెస్‌లో చేరి ప్రస్తుతం అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశానని, పార్టీ మారలేద ని, బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మాట్లాడటం సిగ్గు చేటని బీజేపీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి, కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్‌తో గెలిచి సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని శుక్రవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వారికి సవాల్ విసిరారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన 61 హామీల్లో ఒకటి రెండు తప్ప ఏవీ అమలు చేయలేదని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల గొంతుకోసిందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడమని, చట్ట ప్రకారమే అన్ని జరుగుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కమిటీల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని, ఒక్కో కమిటీ రిపోర్ట్ వచ్చాక దోషులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. జూబ్లీహిల్స్‌లో తెలుగుదేశం పార్టీ పోటీపై తెలంగాణ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయాలని చూస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
మొన్నటి అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు పెట్టాలని డిమాండ్ చేస్తే కేవలం రెండు రోజులు మాత్రమే పెట్టి సీఎం రేవంత్‌రెడ్డి పారిపోయారని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో రెండు రోజులపాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఫార్ములా ఈ- కారు రేస్ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీమంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఇతర అధికారులు బీఎల్‌ఎన్ రెడ్డి, కిషన్‌రావు, ఎఫ్‌ఈవోలను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు.
పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే కుట్రతోనే పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ హై కోర్టులో ఊరట లభించింది. నల్గొండలో వేర్వేరు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన మూడు కేసులను హైకోర్టు కొట్టివేసింది.