Home » BRS
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర సమయం కొనసాగుతోంది. తర్వాత సభలో ప్రభుత్వం రెండు కీలక బిల్లులు ప్రవేశపెట్టనుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెడతారు.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో 2022 మార్చిలో ఈ కారు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో నెలల వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో రహిల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఉద్యమ తెలంగాణ తల్లిని, తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామగ్రామాన ఎండగడతామని చెప్పారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం వెనుకబడిందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ నేతలు.. అవాకులు చెవాకులు మాని ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉద్యమంలో ఆయన పాటలు ఎంతో ప్రత్యేకమని మాజీ మంత్రి చెప్పారు.
తెలంగాణ ఆర్థికాభివృద్ధి తెలిపేందుకు రవాణా శాఖ ఆదాయం ఒక ముఖ్యమైన సూచీ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాక ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లలో వృద్ధి కనిపిస్తుందని ఆయన చెప్పారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ బొమ్మతో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి నిధులు తెచ్చారని కవిత ప్రశ్నించారు.
తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు. దరూర్ ఎస్సారెస్పి కెనాల్ అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాడర్‌ను ఉద్దేశించి కవిత ప్రసంగిస్తారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్‌ను అరెస్టు చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.
‘‘బీఆర్ఎస్ చేపట్టిన గురుకులాల బాటతో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారులో చలనం వచ్చింది. ఇప్పుడు గురుకులాలకు వెళ్తున్నారు. కెమెరాల ముందు హంగామా కాకుండా గురుకులాల బిడ్డల గుండెచప్పుడు వినండి’’ అని మాజీ మంత్రి కేటీఆర్ శనివారం ఎక్స్‌లో పేర్కొన్నారు.