Home » BRS
కేటీఆర్ పేరు వినవస్తున్న అన్ని కేసుల్లోనూ త్వరలో ఆయనపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
మాజీ మంత్రి కేటీఆర్‌ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. లగచర్ల రైతులకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఏడాది కాంగ్రెస్ పాలన పాత చీకటి రోజులను గుర్తు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. శిల్ప శాస్త్రం ప్రకారం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారని చెప్పారు. తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలి.. కానీ బీదగా ఉండవద్దని తెలిపారు. ప్రజల భావోద్వేగాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసే కుట్ర చేస్తోందని వాణిదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లను భ్రష్టు పట్టించారని మంత్రి పొన్న ప్రభాకర్ మండిపడ్డారు. ప్రభుత్వ హాస్టల్స్‌పై శాసన సభలో చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు. హాస్టల్స్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. విద్యార్థులు గురుకులాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అల్లు అర్జున్ అరెస్టును మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. సినిమా చూడడానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.
ప్రశ్నించడమే నేరమా.. నిలదీయడమే పాపమా.. అని బాల్క సుమన్ అన్నారు. లగచర్ల, దిలావర్ పూర్, రైతుకు బేడీలు, విద్యార్థుల మరణాలు, గురుకుల సంక్షోభాలు.. ఇలా వీటన్నింటిపై కేటీఆర్ నిలదీస్తున్నందుకే కుట్రాలా అంటూ ఆయన ప్నశించారు.
లగచర్ల విషయంలో రేవంత్ రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి.. రైతులను విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పదేళ్ల తెలంగాణ అభివృద్ధిపై రిజర్వు బ్యాంకు విడుదల చేసిన నివేదికతోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కళ్లు తెరవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు. అబద్ధాలను ప్రచారం చేసే కాంగ్రె్‌సకు ఆ నివేదిక చెంపపెట్టు అని వాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్లో డబ్బులు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందని, కానీ ఆరు నెలల నుంచి మెస్ ఛార్జీలు చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హాస్టల్ వార్డెన్లు అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనం పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మె