Home » BRS
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్లో డబ్బులు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందని, కానీ ఆరు నెలల నుంచి మెస్ ఛార్జీలు చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హాస్టల్ వార్డెన్లు అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనం పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మె
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
రేవంత్ రెడ్డి అనే అహంకారితో గిరిజన, దళిత రైతులు నెల రోజుల నుంచి జైల్లో మగ్గుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తనమీద దాడి జరగలేదని స్థానిక కలెక్టర్ హుందాగా వ్యవహరించారని చెప్పారు. రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని స్వయంగా కలెక్టర్ దాడి జరగలేదని చెబుతున్నారని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు బాధ్యత ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను అమలు పరిచి ముందుకువెళ్తున్నామని తెలిపారు. ఏడాది పాలన ప్రచారంలో ఎంపీలను భాగస్వాములు కావాలని కోరారు.
పేద విద్యార్థులకు పాఠశాలల్లో భోజనం అందించలేని చేతగాని స్థితిలో ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
తరుచుగా ప్రభుత్వ వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బొండ్రు శోభారాణి ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈ నెల 17న హైదరాబాద్కు రానున్నారు. ఈనెల 24వరకు హైదరాబాద్లోనే ఉండి విచారణ చేపట్టనున్నారు.
చేతి గుర్తుకు ఓటేస్తే చేతగాని సీఎంను తెలంగాణకు అంటగట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఏడాది కిందట కొలువు దీరిన కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని ఆగం చేసిందని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో మాజీ సీఎం కేసీఆర్కు ఉన్న మంచిపేరు చెరిపేసేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి(Maheshwaram MLA P. Sabitha Reddy) ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు శిక్షణాతరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణా తరగతులను బీఆర్ఎస్ బహిష్కరించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల హక్కులకు స్పీకర్ భంగం కల్గించేలా వ్యవహరించారని కేటీఆర్ పేర్కొన్నారు.