Home » BRS
మాజీ మంత్రి హరీష్‌రావు తన ఫోన్‌తో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్లను ట్యాప్ చేయించాడని సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్‌గౌడ్ ఆరోపించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆ పార్టీలో కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా హెడ్ కొణతం దిలీ్‌పను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైడ్రా, మూసీ సుందరీకరణ, లగచర్ల ఘటనలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ.. సర్కారును అప్రదిష్టపాలు చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలవనుంది. వీరిద్దరినీ ఈ నెలాఖరున లేదా డిసెంబరు తొలివారం లో విచారించే అవకాశాలున్నాయి.
Lagacharla Incident: వివాదాస్పదంగా మారిన లగచర్ల ఘటన గురించి జాతీయ ఎస్టీ కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ ఘటనపై కమిషన్ సభ్యులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఏమన్నారంటే..
KTR vs Revanth: లగచర్ల ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ మరోమారు రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్‌గా చేసుకొని ఆయన విమర్శలకు దిగారు. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే..
ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్న వారిపై చర్యలకు తీసుకునేందుకు రేవంత్ సర్కార్ ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా చీఫ్ కొణతం దిలీప్‌ను సోమవారం హైదరాబాద్‌లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రేవంత్ రెడ్డి పాలనపై బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణలు విమర్శలు గుప్పించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే శాంతి భద్రతలు లేవని డీకే అరుణ ఆరోపించారు. బీజేపీ అంటే ఏమిటో ఈ సర్కార్‌కు చూపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి, రాజయ్య రాజకీయ ప్రత్యర్థులు. రాష్ట్ర విభజనతో రాజయ్య, కడియం శ్రీహరి ఇద్దరూ బీఆర్ఎస్లో చేరారు. ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. అయితే వీరిద్దరి మధ్య చాలాకాలంగా రాజకీయ పోరు నడుస్తోంది. ఇద్దరు నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగట్టడమే లక్ష్యంగా కేటీఆర్ పెట్టుకున్నారు. లగచర్ల ఘటనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. రాహుల్, రేవంత్ రెడ్డిల తీరును ఢిల్లీలో ఎండగట్టాలని నిర్ణయించింది. సోమవారం సాయంత్రం 3 గంటలకు ఢిల్లీలోని కాన్యూస్టూషన్ క్లబ్లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.