Home » BRS
గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ సారు ఒక్కసారి గజ్వేల్‌కు రావాలని.. నేనున్నానంటూ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కోరుతున్నారు.
కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం పటాపంచలైందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టుతో సంబంధమే లేకుండా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమల దళం రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటనను పక్కదారి పట్టించేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్ర అంటున్నారని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి వ్యక్తం చేసిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
ఢిల్లీలో సెటిల్మెంట్ చేసుకోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కథ కంచికి పోయిందిని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఈ ఫార్ములా, ధరణి స్కాం కేసులన్నీ గాలికే పోయాయని విమర్శలు చేశారు.
కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం శాపంగా మారడం శోచనీయమన్నారు.
మూసీ కంపులో మూడు నెలలు ఉండాలంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరితే.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఒక్క రాత్రి ఉండి షో చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు.
లగచర్లలో రైతులు దాడులు చేశారన్న నెపంతో పోలీసులు అక్కడి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ నేతలు శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మూసీ నిద్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. బీజేపీ నేతల మూసీ నిద్ర వల్ల ఒరిగేది ఏమీ ఉండదని అన్నారు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మళ్లీ అధికారం కోసం రైతుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.