Home » BRS
‘‘ప్రజాసమస్యలు పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టిలేదు. ఎన్నికల హామీలు నెరవేర్చాలన్న ధ్యాసలేదు.. రేవంత్‌రెడ్డి పాలనలో కేవలం కక్షలు, వేధింపులు, కేసులు, అరెస్టులు తప్ప రక్షణ లేదు.
పేదలను, రైతులను సీఎం రేవంత్‌రెడ్డి రోడ్డున పడేశారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో 41 శాతం క్రైం రెట్ పెరిగిందని గుర్తుచేశారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అని హరీష్‌రావు విమర్శించారు.
Telangana: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరి కోసం కాకుండా.. కొందరి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి పెద్దల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు.
ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని, గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుండి దేశాన్ని కాపాడి, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు.
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించినా.. ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎంట్రీతో బీఆర్ఎస్ వర్గం ఆందోళనలో ఉంది. మరోవైపు ఈ రేసు కేసుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మౌనంగా ఉన్నారు. ఆయన మౌనం గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
దళిత స్పీకర్‌పై ప్లకార్డులు విసిరేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి దళితులపై ప్రేమ ఎక్కడ ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు.
తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఈ చర్యలను తెలంగాణ సమాజం సమష్టిగా అడ్డుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చూస్తే.. కోతలు, కొర్రీలు పెట్టి రైతు భరోసాను ఎగవేసే ఎత్తుగడతో ఉన్నట్లు అర్థమవుతోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని.. అసెంబ్లీలో ఒక మాట చెప్పి తప్పించుకున్నారు.
పబ్లిసిటీ కోసం అదానీ అంశంలో రేవంత్ రెడ్డి ర్యాలీ తీశారు.. కనీసం తెలంగాణ గవర్నర్‌ను కలిశారా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.కాంట్రాక్టర్లు రూ,200 కోట్లు ఇవ్వగానే వారు చేసిన తప్పులు మాఫీ అవుతాయా అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంపై అర్థంలేని కక్ష.. పాలమూరు రంగారెడ్డికి ఉరిశిక్ష వేశారని మండిపడ్డారు. కృష్ణాలో తెలంగాణ నీటి వాటా గురించి పాలమూరు బిడ్డ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ద్వారా వందల టీఎంసీలు ఎత్తుకెళ్లినా రేవంత్ ప్రభుత్వానికి పట్టడం లేదా అని కేటీఆర్ నిలదీశారు.