Home » Business news
టెలికం కంపెనీలన్ని మూడు నెలలక్రితం టారీఫ్ రేట్లను గణనీయంగా పెంచిన తర్వాత చాలా మంది సామాన్యులు రీఛార్జ్ చేపించు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల యూజర్లే కాకుండా ఫీచర్ ఫోన్ల కస్టమర్లు కూడా ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జియో ఒక ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
బ్యాంకులు ఏ రోజున మూసి ఉంటాయి, ఏ రోజున కార్యకలాపాలు కొనసాగిస్తాయనే స్పష్టత ఉంటే వినియోగదారులు తదనుగుణంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేసుకునే వీలుంటుంది. జాతీయ, ప్రాంతీయ పండుగల కారణంగా నవంబర్ 2024లో కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు చాలా సెలవులు వచ్చాయి.
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో దూసుకెళ్తున్నాయి. ప్రధాన సూచీలైన BSE సెన్సెక్స్, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ సూచీలు దిగువకు పయనిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా నష్టపోయిన, లాభపడ్డ స్టాక్స్ వివరాలను ఇక్కడ చుద్దాం.
దలాల్ స్ట్రీట్‌లో ఓ స్మాల్‌క్యాప్ స్టాక్ చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే ఈ షేర్ ధర లక్షల రూపాయలు పెరిగింది. దీంతో ఈ కంపెనీలో పెట్టుబడులు చేసిన వారి సంపద ఆమాంతం పుంజుకుంది. రాత్రికి రాత్రే పెట్టుబడిదారుల అదృష్టాన్ని మార్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
దీపావళి పండుగ ముందే బంగారం, వెండి తీసుకోవాలని చూస్తున్నవారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా తగ్గిన ఈ ధరలు నేడు మళ్లీ పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయి. ఎంత స్థాయికి చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Jio Finance Smart Gold Scheme: ధన్తేరస్ సందర్భంగా ముఖేష్ అంబానీకి చెందిన జియో ఫైనాన్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కేవలం 10 రూపాయలకే బంగారాన్ని అందిస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..
వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు లాభాల జోష్‌లో పయనించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు రాణించడం మార్కెట్లకు కలిసివచ్చింది. ఉదయం నష్టాల్లో కదలాడిన మార్కెట్లకు మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్ల అండ లభించింది. దీంతో వరుసగా రెండో రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లోనే ముగిశాయి.
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73,140గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.460 తగ్గింది. విజయవాడ, విశాఖపట్టణంలో హైదరాబాద్ మాదిరిగా ధరలు ఉన్నాయి.
వరుసగా నష్టాలను చవిచూస్తున్న మార్కెట్లు సోమవారం లాభాల జోష్‌లో పయనించాయి. బేర్ పట్టును తప్పించుకుని లాభాల బాట పట్టాయి. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడం, ఆసియా మార్కెట్ల పాజిటివ్ ర్యాలీ దేశీయ సూచీలకు కలిసి వచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, ద్రవ్యోల్బణం, రూపాయితో డాలర్ మారకం విలువ ఆధారంగా బంగారం ధరలో మార్పు జరుగుతుంటుంది. హైదరాబాద్‌లో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.73, 590గా ఉంది.